India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి- చించుఘాట్ గ్రామాల మధ్యగల మర్రివాగుపై బ్రిడ్జ్ మంగళవారం కుంగిపోయింది. దీంతో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ సీఐ, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుంగిన బ్రిడ్జి పై నుంచి తాత్కాలికంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. త్వరలో మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించనున్నారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 22 వరకు గడువు ఉండగా 26 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి PG రెండో సంవత్సర పరీక్షలు, సెప్టెంబర్ 20 నుంచి PG మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
కేంద్రబడ్జెట్, రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రబడ్జెట్లో భాగంగా జిల్లాకు దక్కేవరాల ప్రకటనపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క నేటినుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తామని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగలో గల్లంతైన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) గ్రామానికి చెందిన శివ మిత్రులతో కలిసి ఆదివారం రాత్రి పెన్‌గంగాకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఐతే సోమవారం యువకుడి కోసం డీడీఆర్ఎఫ్ బృందం పోలీసులు గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు.
క్యాన్సన్ బారినపడ్డ వారు జిల్లాలో 365 మంది ఉన్నట్లు పాలియేటివ్ కేర్ ద్వారా గుర్తించారు. ఆరోగ్య మహిళా క్లినిక్‌లు స్టార్ట్ అయిన నాటి నుంచి టెస్టులు చేయించుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. థైరాయిడ్‌తో 188, మూత్రాశయ సమస్యలు 1,081, PCOS 994, మెనోపాజ్ 4,058, సుఖవ్యాధులతో 50, ఓరల్ క్యాన్సర్ అనుమానితులు 23, రొమ్ము క్యాన్సర్ 64, గర్భాశయ క్యాన్సర్ 22, క్యాన్సర్ నిర్ధారణ అయిన వారు 02 మహిళలున్నారు.
మిషన్ భగీరథ పథకం తీరుపై జూన్ మొదటి వారం నుంచి సర్వే చేపడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ద్వారా నిధులు సమీకరించేందుకు ఇంటింటి సర్వే కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 468 పంచాయతీల్లో 1,45,502 గృహాల్లో 1,44,267 ఇళ్లల్లో సర్వే చేశారు. మొత్తం 99 శాతం పూర్తి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందుతుందా? ఎన్ని ఇళ్లకు సరఫరా అవుతోంది అలాగే తదితర విషయాలపై త్వరలోనే లెక్క తేలనుంది.
★ బాసర: పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యయత్నం
★ ఆదిలాబాద్: చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలు అరెస్ట్
★ కుబీర్: అప్పులబాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
★ జైనథ్: పెన్ గంగా నదిలో యువకుడు గల్లంతు
★ లోకేశ్వరం: పట్టపగలే తాళం ఉన్న ఇంట్లో చోరీ
★ సిర్పూర్: వైన్స్ షాపులో చోరి
★ చెన్నూర్: నిషేధిత గుట్కా పట్టివేత
★ ఇచ్చోడ: వాహనం ఢీకొని జింక మృతి
★ దీలవార్పూర్‌లో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లెక్కలపై స్పష్టత లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో డీసీసీబీ పరిధిలో రూ. లక్ష లోపు పంట రుణం పొందిన రైతులు 35,560 మంది ఉండగా మాఫీ సొమ్ము రూ.183.21 కోట్లుగా ఉంది. 12,477 మందికి రూ.63.25 కోట్లు మాత్రమే మాఫీ సొమ్ముజమైంది. సంఘాల వారీగా అనేక మంది పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జైనథ్ మండలం డొల్లార వద్ద పెనుగంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెనుగంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.