Adilabad

News August 22, 2024

ఇరాక్‌లో జన్నారం వాసి మృతి 

image

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రాజమల్లు(35)బుధవారం ఇరాక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమల్లు 7 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఇరాక్ దేశం వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వెల్లడించారు.

News August 22, 2024

ADB: డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు వృద్ధి కాకుండా చూడాలన్నారు. ఆయనతో పాటు డీఎంహెచ్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖమర్, తదితరులున్నారు.

News August 22, 2024

ఉమ్మడి ADB జిల్లాలో కూరగాయల సాగు వివరాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టమాటా పంట సాగుతో పాటు కూరగాయల ఉత్పత్తి విపణి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 48,560 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయబడుతున్నాయి. ఈ విస్తరణలో, దాదాపు 15 ఎకరాల్లో టమాటా పంట సాగించబడుతుంది. జిల్లాలో మొత్తం 27.39 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో, కూరగాయల సాగు చేసే గ్రామాల సంఖ్య 212, ఏడాది మొత్తంలో 6.20 లక్షల టన్నులు కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి.

News August 22, 2024

ఆదిలాబాద్: పీఎస్ ఎదుట విద్యార్థుల ధర్నా

image

ఆదిలాబాద్ టూ టౌన్ పీఎస్ వద్ద గురుకుల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మావల గురుకుల ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్‌ను తొలగించేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

News August 22, 2024

ADB: LRS దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

LRS దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా పంచాయతి, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా LRS దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలన్నారు. అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

News August 21, 2024

మంచిర్యాలలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

image

మంచిర్యాల పట్టణంలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాలోని ఆరుగురు విటులు, ఒక మహిళను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు భైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

News August 21, 2024

నిర్మల్: ఈ నెల 24న జాబ్ మేళా

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 24 ఉదయం 9 గంటలకు HCL టెక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO జాదవ్ పరుశురాం తెలిపారు. 2024 సంవత్సరంలో 75% మార్కులతో ఉత్తీర్ణులైన HEC, CEC విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News August 21, 2024

అదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేశారు. స్టేషన్ పరిధిలోని ద్వారకనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్క సమాచారంతో సీసీఎస్ పోలీసులు బుధవారం దాడిచేశారు. వ్యభిచార గృహంలో ఉన్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News August 21, 2024

ASF: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి

image

భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్నిజిల్లాల కలెక్టర్లు, అధికారులతో భారీ వర్షాల సమయంలో ప్రజాసంక్షేమానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News August 21, 2024

ADB: కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ముస్తాఫా, అదనపు పరీక్షల నియంత్రణాధికారి నాగరాజు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27, 29, 31 సెప్టెంబర్ 2, 4, 6న పరీక్షలు మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు జరుగుతాయన్నారు.