India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో గల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలనకు నియమించిన రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ రాజర్షిషా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 12000 దరఖాస్తులను 3 నెలలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పరిశీలన కొరకు వచ్చే అధికారులకు సహకరించాలని తెలిపారు.

బాసర గోదావరి ఘాట్ వద్ద నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఏఎస్ఐలు ఉజ్వల, లక్ష్మణ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధి మామిడిగూడ(జి), మామిడిగూడ(బి) గ్రామాల ప్రజలకు ఏటా వర్షాకాలంలో తిప్పలు తప్పడం లేదు. సోమవారం రెండు గ్రామాల రైతులు పొలాలకు, ప్రజలు వార సంతకు వెళ్లారు. ఇంతలో కురిసిన భారీ వర్షానికి పడేగాం వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కర్రలతో ఒకరికొకరు సాయంగా వాగు దాటారు.

వర్షాకాలంలో ASF జిల్లాలో గర్భిణులు హడలిపోతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు దారులు లేకపోవటం వారికి శాపంగా మారింది. పెంచికల్ పేట్లో మహిళను ఎడ్లబండిపై 4KM తీసుకుళ్లారు. అక్కడి నుంచి SKZR ఆస్పత్రికి తరలించగా.. కడుపులో బిడ్డ మృతి చెందింది. AUG 10న మరో గర్భిణి వాగు ఒడ్డునే ప్రసవించగా శిశువు మరణించింది. ఆమెను ఆస్పత్రి తరలించగా 800gతో మరో శిశువుకు జన్మినించింది. ఆ శిశువు కూడా మృతి చెందింది.

ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి (30) లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల ప్రకారం.. బాలిక తన తండ్రితో కలిసి దుకాణానికి వచ్చింది. తండ్రి కొనుగోళ్లు చేస్తూ ఉండగా అక్కడే ఉన్న బాలికను నిందితుడు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. గమనించి తండ్రి అతడిని మందలించి వన్ టౌన్లో ఫిర్యాదు చెయ్యగా ఆదివారం రాత్రి నిందితునిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 49 వార్డులలో డ్రై డే, ఆంటీ లార్వా, స్ప్రేయింగ్ మరియు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డిఎంహెచ్ఓ కృష్ణ, బల్దియా కమిషనర్ ఖమర్ ఉన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. ఉ:11 గంటలకు హాజీపూర్ మండలం రాంపూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులకు చేసే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని వాటి వర్గాలు తెలిపాయి.

పిడుగుపడి ఒకరు మృతిచెందిన ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీడం శ్రీను (45) అనే రైతు పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురిసి అతనిపై పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వారు తెలిపారు.

పార్కింగ్ చేసిన కారు నుంచి రూ. 28 లక్షలు స్వాహా చేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో సంచలనం రేపింది. తనిష్క్ ప్లైవుడ్ కంపెనీకి చెందిన సేల్స్ బాయ్స్ పలు దుకాణాల నుంచి వసూలు చేసిన నగదును తమ కారు టీఎస్ 13 ఈజీ 8100 సీటు కింద పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో పల్సర్ బైక్ పై హెల్మెట్, కర్చీపు ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు.

రేపు మంచిర్యాల జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి పంచాయతీ పరిధిలోని రాంపూర్ చొక్కారాంనగర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు మాధవరపు వినయ్ ప్రకాశ్ రావు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.