India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక (14) ను బావ వరుస అయ్యే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగు చూసింది. ఈనెల 13న కిరాణా దుకాణానికి వెళ్ళిన బాలికను బావ వరుస అయ్యే అదే కాలనీకి చెందిన యువకుడు చెయ్యి పట్టి లాగి వేధించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు SI విష్ణువర్ధన్ తెలిపారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా, రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులో 698.52అడుగుల నీటిమట్టం ఉంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి 8786 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతోందని వారన్నారు.

పిడుగుపాటుకు యువరైతు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. చౌదరి రమేశ్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. దీంతో అతను ఓ చెట్టు కింద తలదాచుకున్నాడు. అదే సమయంలో పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

అదిలాబాద్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని బేలా మండలం కేంద్రంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో వృక్షశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందింది. ఉపాధ్యాయురాలు మృతి పట్ల పాఠశాల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని దత్తాత్రేయ మందిరంలో ఉన్న హుండీని బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ కొల్లగొట్టాడని స్థానికులు తెలిపారు. రా.10గంటలకు ప్రవేశించిన దుండగుడు ముందుగా అంతరాలయంలోని దత్తాత్రేయ టెంపుల్ హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందన్నారు. ప్రధాన హుండీని తెరవడానికి యత్నించి విఫలమయ్యాడని, గురువారం ఆలయానికి వచ్చిన సిబ్బంది హుండీలను చూసి పోలీసులకు చెప్పారన్నారు.

చింతలమనేపల్లి మండలంలోని ఖర్జెల్లీ గ్రామంలో గురువారం కురిసిన గాలివానకు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకుంటున్న నాయిని తులసి ఇల్లు కూలిపోయింది. భారీగా గాలి రావడంతో ఇంటి పైకప్పుతో సహా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, నాయకులు స్పందించి తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.

కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ శివారుల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం లక్మాపూర్‌కి చెందిన రాజు చేనులో మంచెకింద ఓ జంతువు కూర్చున్నట్లు, అక్కడ ఉన్న వివిధ వస్తువులను చిందర వందరగా చేసిన ఆనవాళ్లతో పాటు పాదముద్రలు కనిపించాయి. ఆటవీ అధికారులు పాదముద్రలు పరిశీలించారు. అవి దాదాపు చిరుతవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. చిరుతతో పాటు ఓ చిన్న పిల్ల కూడా ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.

ప్రభుత్వం జిల్లాల వారీగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేయడంతో 2018 నుంచి ఉన్న బకాయిల నుంచి రైతులకు రుణవిముక్తి లభించింది. ఉమ్మడి జిల్లా మొత్తంలో తుది విడతలో 51 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. 61,416 మంది రైతుల ఖాతాల్లో రూ.846.41 కోట్లు నేరుగా జమ చేసేలా నిధులు విడుదల చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో 73 మంది పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గౌష్ అలం మెడల్స్ అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ఉత్తమసేవలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3 ఉత్తమసేవా, 3 ఉత్క్రిస్ట సేవ, 2 అంత్రికసేవ, 65 సేవామెడల్స్ పొందిన పోలీస్ అధికారులకు ఎస్పీ మెడల్స్ బహుకరించారు.

78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.