India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ అవమానం జరిగిందని ప్రాతినిధ్య AITUC సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సభా ప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. తిరుపతి మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా వేడుకలకు పిలిచి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ఆగ్రహించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం పనికిరాదన్నారు.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఆదివాసీ బాలిక(17)ను ప్రేమపేరుతో మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాధిత బాలికను ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌కు చెందిన ముబాషిర్ 6 నెలలుగా ప్రేమపేరుతో మభ్యపెడుతూ లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించడాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం ఘనంగా స్వాగతం పలికారు.

మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన రైతు దూసముడి రాములు-లక్ష్మి దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ ఇటీవల TGPSC విడుదల చేసిన సివిల్ ఇంజినీరింగ్ AEE ఫలితాలలో మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించాడు. అలాగే AE, TPBO, TO(Ground Water dept) మెరిట్ అర్హతను సాధించాడు. 10th వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు KUలో BTech, JNTUHలో MTech పూర్తిచేశాడు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానంలో కలిసి తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పోలీసులు ప్రత్యేక కవాతు రిహార్సల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ సురేందర్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.

లోకేశ్వరం మండలం బాగపూర్ గ్రామానికి చెందిన దర్శనం నరేష్‌కు, నగర్ గ్రామానికి చెందిన అనితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తేజశ్రీ, మిన్ను సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్ళగా నరేష్ మత్తుకు బానిసయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సక్రియా నాయక్ బుధవారం భార్యభర్తలను పోలీసు స్టేషన్‌కు రప్పించి విడిపోయిన వారిని ఒక్కటి చేశారు.

ప్రతి సంవత్సరం జనవరిలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డుకు 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు చూపించిన సాహసాన్ని ప్రస్తావిస్తూ ఆన్‌లైన్‌లో https://awards.gov.inలో ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోగలరు.

ఇథనాల్ పరిశ్రమ తరలించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం దిలావర్పూర్ మహిళలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు మనుషుల ప్రాణాలు తీసే కంపెనీ మా గ్రామంలో నెలకొల్పద్దంటూ ఎండలో సైతం ఆందోళన చేసింది. ఇలాంటి కంపెనీ వస్తే నా ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా పోరాడుతానని ఆమె నినాదించడంతో మహిళలంతా ఒక్కసారిగా నినాదాలు చేశారు.

అన్నదమ్ముల మధ్య గోడవలలో అన్న మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ సతీశ్ కుమార్ ప్రకారం.. బురుగూడ గ్రామ సమీపంలో గల పైపుల కంపెనీలో బీహార్ కు చెందిన అన్నదమ్ములు సంజయ్, అజయ్ కూలీలుగా వచ్చారు. సోమవారం వారిద్దరి మధ్య గొడవ జరగగా అజయ్.. సంజయ్‌ని తలపై కొట్టడంతో బలమైన గాయమైంది. తోటి కూలీలు స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.