India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అన్నదమ్ముల మధ్య గోడవలలో అన్న మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ సతీశ్ కుమార్ ప్రకారం.. బురుగూడ గ్రామ సమీపంలో గల పైపుల కంపెనీలో బీహార్ కు చెందిన అన్నదమ్ములు సంజయ్, అజయ్ కూలీలుగా వచ్చారు. సోమవారం వారిద్దరి మధ్య గొడవ జరగగా అజయ్.. సంజయ్‌ని తలపై కొట్టడంతో బలమైన గాయమైంది. తోటి కూలీలు స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు.

ఆసిఫాబాద్, MNCL జిల్లా పులులకు చిరునామాగా నిలుస్తోంది. తాజాగా జిల్లా పరిధుల్లోకి తాడోబా నుంచి మరో కొత్తపులి వచ్చింది. ప్రస్తుతం ASF అటవీ పరిసర ప్రాంతాల్లో తిరుగాడుతోంది. ఎర్రగుట్ట ప్రాంతంలో ఆవును చంపిన పులి నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేసింది. అధికారులు ఆవును చంపిన చోట కెమెరాలు అమర్చగా అక్కడే తిరుగుతున్నట్లు చిత్రాలు లభించాయి. కాగా ఏ2 అనే మగపులి MNCL జిల్లా రేపల్లెవాడ అటవీ ప్రాంతానికి చేరుకుంది.

ఆదిలాబాద్ 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఝాడే సిద్ధార్థ్, బాదం భూమన్న, కట్కం రవీందర్‌తో పాటు పలువురు కాలనీ వాసులు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేతలు జహీర్ రంజాని, లోక ప్రవీణ్ రెడ్డి, సురేందర్, తదితరులున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై, వారి వ్యాపారాలపై దాడులకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిన ఆదిలాబాద్ బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి ఉంచారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వ్యాపారస్థులు బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

◆ తాండూర్ గుడుంబా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
◆ నిర్మల్, ఆదిలాబాద్‌లో బంద్ ప్రశాంతం
◆ ఉట్నూర్: పంట పొలాల్లో అడవిపందుల విధ్వంసం
◆ తాండూరు: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
◆ మందమర్రి: సమాధులు కూలగొట్టారని ఫిర్యాదు
◆ ఆదిలాబాద్: తోపుడుబండ్ల వివాదం
◆ లోకేశ్వరం: సొంత పరీక్షలతో రోడ్లకు మన మత్తు చేయించిన రైతు
◆ రెబ్బెన: 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
◆ ఉమ్మడి జిల్లాలో హార్ ఘర్ తీరంగా ర్యాలీ

మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరి నదిపై గతంలో ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన స్వలాభం కోసం మరో ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

ఆ యువకుడు ఎప్పటికైనా వెండితెరపై మెరవాలని కలలు కన్నాడు. ADBకి చెందిన ఆటో డ్రైవర్ సూర్యవంశీ ప్రశాంత్ ప్రతినాయకుడు అనూప్ సింగ్ ఠాకూర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 6 ప్యాక్ కోసం జిమ్‌లో శ్రమించాడు. పొడవాటి జట్టు పెంచుకున్నాడు. తాజాగా మిస్టర్ మహారాష్ట్ర పోటీల్లో పాల్గొని ఉత్తమ హెయిర్ స్టైల్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.

ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈ నెల 20 లోగ సంబంధిత ఎంఈవోలకు దరఖాస్తు పెట్టుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో MEOలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ సేవలందించిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎన్నిక చేసి ఈ నెల 24 న జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో సమర్పించాలని ఎంఈవోలకు ఆమె సూచించారు.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698. 075 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1419 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.

మహిళా జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లా మరో విషయంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. జిల్లాలోని పరిపాలన యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళా అధికారులే ఉండడం విశేషం. అత్యంత కీలకమైన కలెక్టర్, ఎస్పీ, డీఆర్డీఓ, ఆర్డీఓ పోస్టుల్లో మహిళా అధికారులే బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌గా అభిలాష అభినవ్, ఎస్పీగా జానకీ షర్మిల, డీఆర్డీఓగా విజయలక్ష్మి, ఆర్డీవోగా రత్న కల్యాణి ఇలా అత్యధికులు మహిళలే ఉన్నారు.
Sorry, no posts matched your criteria.