India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహారం ఉత్సవాలు
★ ఆదిలాబాద్‌లో హైడ్రామా
★ దస్తురాబాద్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
★ భీమిని: నిషేధిత గడ్డి మందు పట్టివేత
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల సందడి
★ తాంసి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
★ భైంసా: దాబాల్లో పోలీసుల దాడులు.. మద్యం స్వాధీనం
★ ఉమ్మడి వ్యాప్తంగా కురిసన వర్షం
★ నిర్మల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.
రన్నింగ్‌తో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. ప్రజల్లో రన్నింగ్ పై అవగాహన పెంచేందుకు ఆయన ఆదివారం నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు సుమారు 35 కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని, దాని ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్ష సూచన ఉందని ప్రకటించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అదిలాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. మున్సిపల్ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రజాసేవ భవనంలో 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పిన్నవార్ రాజేశ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుడిసెర్యాల గ్రామానికి చెందిన పవన్ ప్రేమ విఫలమై మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబీకులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పవన్ ఆదివారం మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 ఏజెన్సీ మండలాల్లో 500కు పైగా ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 60 వాగులపై వంతెనలు లేక 150కి పైగా గ్రామాల ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. మరో 150 గ్రామాల్లో లెవల్ వంతెనలు సైతం ఉప్పొంగి బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాయి. ఈ వాగులు దాటుతూ.. వైద్యం అందక నాలుగేళ్లలో 20 మంది మృత్యువాత పడ్డారు.
బాసర మండలానికి చెందిన బీజేపీ నాయకులు కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి చిత్రపటమును, ప్రసాదాన్ని అందించారు. త్వరలో బాసర అమ్మవారిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయినాథ్ పటేల్, కార్యకర్తలు నితిన్, మేకల బన్నీ, గణేష్ ఉన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. కుటుంబ వ్యవహారాల విషయంలో తలెత్తిన వివాదంలో అత్తను అల్లుడు హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..స్థానిక సున్నంబట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికకు ఇదే ప్రాంతానికి చెందిన శాతం వెంకటేశ్‌తో వివాహమైంది. వారం రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేసి హతమార్చి తాను సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తలమడుగు మండలంలోని కొత్తూరు శివారులో చిరుతపులి దాడిలో మేకపోతు మృతి చెందింది. స్థానికుల వివరాలు.. బాతురి మల్లేశ్ మేకల మందను శనివారం మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిరుత పులి దాడి చేసి మేకను హతమార్చింది. దీని విలువ రూ.10 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా.. గత 15 రోజుల క్రితం మేకల మందపై దాడి చేయగా కాపరుల అరుపులతో చిరుతపులి విడిచిపెట్టి వెళ్లింది.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) 28వ ద్వైవార్షిక మహాసభలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు. సభలకు ఛీప్‌గెస్ట్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నట్లు చెప్పారు. బీఎంఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా రానున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికవర్గం మహాసభలను సక్సెస్ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.