Adilabad

News July 14, 2024

జాతీయ అవార్డు అందుకున్న RIMS వైద్యుడు

image

ఆదిలాబాద్‌ RIMS వైద్యుడు జాతీయ అవార్డు అందుకున్నాడు. RIMS పాథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డా.అరుణ్ కుమార్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఎక్సలెన్స్ విభాగంలో జాతీయ అవార్డు- భారతదేశపు ఉత్తమ వైద్యుల అవార్డు 2024 అందుకున్నారు. ఈ అవార్డు కోసం దేశం నుంచి 126 నామినేషన్లు రాగా దాంట్లో డా.అరుణ్ కుమార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. RIMS డైరెక్టర్ జైసింగ్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News July 13, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు.!

image

◆ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం
◆ మంచిర్యాలో రైలు కిందపడి యువకుడి మృతి
◆ బేలలో 20 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
◆ నిర్మల్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ◆ తాంసిలో పిడుగుపాటుకు 12 మేకలు మృతి
◆ మంచిర్యాల: చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ ◆ నిర్మల్: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
◆ ఆదిలాబాద్‌లో నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్
◆ ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్.

News July 13, 2024

ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్

image

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఐదుగురు జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాణాప్రతాప్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులో జూదం ఆడుతున్నరనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.13,800 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు వెల్లడించారు.

News July 13, 2024

ఆదిలాబాద్: DOST రిపోర్టింగ్‌కు మరొ అవకాశం

image

డిగ్రీ కళాశాలలో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. DOST ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పొడగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT

News July 13, 2024

కడెం: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన తుప్ప నరేశ్ (36) కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్య, అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

News July 13, 2024

లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

image

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

News July 13, 2024

ఆదిలాబాద్: పంచాయతీల్లో పైసల్లేవ్..!

image

జిల్లాలో 468 జీపీలు ఉన్నాయి. పంచాయతీల్లో పైసల్లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో GPల ఖజానా నిండుకుంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా మల్టీపర్పస్ కార్మికులకు నెలల తరబడి జీతాలివ్వలేని దుస్థితి. ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆదాయం కలిగిన, మేజర్ జీపీలను మినహాయిస్తే చిన్న పంచాయతీల్లో పాలన కార్యదర్శులకు పెనుభారంగా మారుతోంది.

News July 13, 2024

లక్ష్మణచందా: సరస్వతీ కెనాల్ పై కూలిన బ్రిడ్జి

image

లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ సమీపంలో గల సరస్వతి కెనాల్ పై ఉన్న ఆయకట్ట బ్రిడ్జి గురువారం కుప్పకూలింది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు తమ పొలాలకు ఎలా వెళ్లి పండించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

News July 13, 2024

జన్నారంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

జన్నారం మండలం టీజీపల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు నుంచి ఉట్నూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

ఆసిఫాబాద్: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి: కలెక్టర్

image

కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే శుక్రవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.