Adilabad

News June 12, 2024

ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. పాఠశాల పున:ప్రారంభం కావడంతో బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుంచి జైనథ్‌కు బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హతమార్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

తీర్యాని: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని యువతి పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన తీర్యాని మండలంలో జరిగింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. భింజీగూడ గ్రామపంచాయతీకి చెందిన ఇంద్ర భాయ్ (16)అనే యువతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రి, అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.

News June 12, 2024

బోథ్ మండలంలో చిరుతపులి సంచారం?

image

ఓ వాహనదారుడికి చిరుతపులి కనిపించిన ఘటన మండలంలో జరిగింది. వివరాలిలా.. బోథ్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం రాత్రి జీడిపల్లె మీదుగా సొనాలకు వెళ్తున్నాడు. జీడిపల్ల-టివిటి గ్రామాల మధ్య నీటి కుంట సమీపంలోని వంతెన వద్ద చిరుతపులి చూసినట్లు తెలిపాడు.

News June 12, 2024

ADB: ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,758 స్కూల్స్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు అన్ని పాఠశాలలు మొత్తం 4,758 ఉన్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,432, ఆ తర్వాత కొమురం భీమ్ జిల్లాలో 1,248 ఉన్నాయి. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలో 1,044, నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలో అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

News June 12, 2024

ఆసిఫాబాద్: 44 మంది ఉపాధి సిబ్బందికి నోటీసులు

image

పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా. ఈ సంవత్సరంలో నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందచేయగా ఇద్దరు ఫీల్డ్, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

News June 12, 2024

ADB: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.

News June 11, 2024

ASF: కుక్కల బారి నుంచి జింకను రక్షించిన యువకుడు

image

కుక్కల దాడి నుంచి జింకను ఓ యువకుడు కాపాడి అటవీ అధికారులకు అప్పగించాడు. ఆసిఫాబాద్‌లోని మాణిక్ గూడలో శివారులో ఓ మచ్చల జింకను కుక్కలు చుట్టు ముట్టి దాడికి యత్నించాయి. తప్పించుకునే ప్రయత్నంలో అది ఫయాజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చింది. అక్కడ ఉన్న ఫయాజ్ కుమారుడు రహ్మన్ కుక్కలను తరిమి కొట్టి జింకను కాపాడాడు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో యువకుడిని అధికారులు అభినందించారు.

News June 11, 2024

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి: ఖుష్బూ గుప్తా

image

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని పీఎంఆర్సీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నూతన ఒరవడిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి దృష్టి సారించామని ఆమె వెల్లడించారు.

News June 11, 2024

మంచిర్యాల: ఐటీఐలో అడ్మిషన్ గడువు పొడిగింపు

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐలో మొదటి దఫా అడ్మిషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్ లలో శిక్షణను పొందడానికి మొదటి దఫా సీట్ల కొరకు జూన్ 14వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.https://iti.telanhana.gov.in వెబ్ సైటులో నిజ ధ్రువపత్రాల ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 11, 2024

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహచారి తెలిపారు. మొదటి పేపర్ జులై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.