India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల రామాలయంలో చోరీ జరిగినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న బంగారు పుస్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆలయం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రాజు అనే టికెట్ కలెక్టర్ పై ఒప్పంద కార్మికుడు దాడికి యత్నించాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నట్లు సమాచారం. సోమవారం రైల్వే స్టేషన్ లో వీరి మధ్య వివాదం తలెత్తగా ఒప్పంద కార్మికుడు.. రాజుపై పెట్రోల్ పోసి దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం కావటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై కేసు నమోదైనట్లు సమాచారం.
వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, అధిక వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్మల్ పట్టణ పోలీసులు అజార్ ఖాన్, రాథోడ్ అనిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని ఓ మహిళ దుస్తులు లేకుండా రోడ్డు పై కనబడింది. దీంతో ఆ మహిళకు తమ సొంత ఖర్చులతో దుస్తులు కొనిఇచ్చి స్థానిక మహిళల సహాయంతో బట్టలు తొడిగించారు. తమ విధులతో పాటు సామాజిక సేవలో ముందున్న పోలీసులను స్థానికులు అభినందించారు.
గుడుంబా విక్రయించిన ఇద్దరు మహిళలకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. సోమవారం నింధితులను జిల్లా జైలుకు తరలించారు. గుడిహత్నూర్‌కి చెందిన జాదవ్ విమల, భక్వాడ్ లక్ష్మి గుడుంబా అమ్ముతూ పలుమార్లు పట్టుబడగా వారిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్ళీ గుడుంబా అమ్ముతూ పట్టుబడటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన వెల్లడించారు.
నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPకేంద్రం ఆధ్వర్యంలో తను మామిడి కాయలు అమ్మినట్లు తెలిపాడు. రూ.1.50లక్షలు వరకు కేంద్రం నుంచి రావాలని, నెల రోజులైనా అధికారులు డబ్బు చెల్లించడం లేదని వాపోయాడు. ఎన్నిసార్లు కేంద్రం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదన్నాడు.
ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పక్షి దర్శనం ఇచ్చింది. తలమడుగు మండలం కోసాయి గ్రామ సమీప అడవుల్లో పొన్నంకి పిట్ట సోమవారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కెమెరాకు చిక్కింది. హిమాలయాల అడవులు, మధ్య పశ్చిమ భారత దేశంలోని కొండలలో ఎక్కువగా ఉండే ఈ పక్షి జిల్లా అడవుల్లో ప్రత్యక్షమైంది. ఇది తొమ్మిది రంగుల్లో ఉంటుంది. తెల్లవారుజామున, సంధ్యా సమయంలో వినసొంపైన రెండు శబ్దాలను చేస్తుంది.
ప్రాజెక్టులో గల్లంతైన విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది. భైంసా పట్టణం పిప్రి కాలానికి చెందిన సోలంకె పవన్(18)
ఆదివారం స్నేహితులతో కలిసి సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారీ ప్రాజెక్టులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి వరకు గాలించినప్పటికీ మృతదేహం లభ్యమవ్వలేదు. సోమవారం ఉదయం మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు తెలిపింది.
సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు నీటలో గల్లంతైన ఘటన ఆదివారం భైంసాలో చోటుచేసుకుంది. ఏపీనగర్కు చెందిన సోలంకి పవన్(18)తన స్నేహితులతో కలిసి గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద బండపై కూర్చొని సెల్ఫీ దిగుతుండగా సూర్యవంశీ చెప్పు నీటిలో పడిపోయింది. దానిని తీసేందుకు పవన్, శివ కార్తీ నీటిలో దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు శివ, కార్తీను రక్షించగా పవన్ గల్లంతయ్యాడు. చీకటి పడడంతో ఆచూకీ లభించలేదు.
Sorry, no posts matched your criteria.