India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2015 బ్యాచ్‌కు చెందిన బీ.కాం. విద్యార్థి యోగేంద్రసింగ్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరిగిన పరీక్ష ఫలితాలలో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్, కామర్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం అనిత, తన హిందీ గురువు T. ప్రతాప్ సింగ్, అధ్యాపకులు జగరామ్, దయాకర్ యువకుడిని సన్మానించి అభినందించారు.
విద్యార్థి దశ నుంచే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దండేపల్లి మండలం అల్లీపూర్‌కు చెందిన ఆదివాసీ నేత కొట్నాక తిరుపతికి రాష్ట్ర స్థాయి పదవి వరించింది. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లారీకి మరమ్మతులు చేస్తుండగా ఓ డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన నేరేడిగొండ మండలం ఆరేపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి రబ్బర్ లోడుతో తమిళనాడు-ఢిల్లీకి వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ నిలిచిపోయింది. డ్రైవర్ లారీని నిలిపి హ్యాండ్ బ్రేక్ వేయకుండా టైర్ల వద్ద మరమ్మతులు చేస్తుండడంతో లారీ వెనక్కి వచ్చి డ్రైవర్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.
వాంకిడి మండల కేంద్రానికి చెందిన గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుడు మడావి రాజేశ్వర్(58) గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారు జామున అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వర్ తిర్యాణి మండలం గుండాల గిరిజన పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజులపాటు జరుగగా సోమవారంతో ముగిసింది. నేడు 201 మంది హాజరు కాగా మొత్తం 715 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తయినట్లు కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. జులై 15 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలని, 19న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో సత్తా చాటారు. జూన్ 5 నుంచి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన 5KM వాకింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో శకుంతల(48) రెండో స్థానం, ఆమె భర్త ఆనంద్ రావు(56) ఐదో స్థానం సాధించారు. దీంతో వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు సన్మానించి అభినందించారు.
సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగులో చోటుచేసుకుంది. ఉమ్రి గ్రామానికి చెందిన మేస్రం కృష్ణ తల్లిదండ్రులను ఇటీవల సెల్ ఫోన్ కొనివ్వమని అడిగాడు. ఆర్థిక పరిస్థితి కారణంగా కొనివ్వలేమని చెప్పడంతో ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం గ్రామ శివారులోని గుట్టపైన చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బోడకుంట హరికృష్ణ(24) శనివారం రోజున లక్షట్టిపేట గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఒక రైతు తన పంట పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పాము కాటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఇచ్చోడ మండలం దాబా (కే) గ్రామంలో చోటు చేసుకుంది. దాబా (కే) గ్రామానికి చెందిన జాదవ్ లక్ష్మణ్ (28) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.