Adilabad

News June 9, 2024

ADB: స్తంభం పైనే మృతి చెందిన ఎలక్ట్రిషన్

image

విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. యాపల్ గూడకు చెందిన మోతిరామ్ విద్యుత్ పనులు చేస్తుంటాడు. అయితే ఆదివారం విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయన స్తంభం పైనే మృతి చెందాడు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

News June 9, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

image

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కావల్కర్ లక్ష్మీ బాయి, కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇళ్లల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

ADB: 220 భాషా పండిత పోస్టుల ఉన్నతీకరణ

image

ఆదిలాబాద్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలకు సంబంధించి 220 లాంగ్వేజ్ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరణ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందన్నారు.

News June 9, 2024

ఆదిలాబాద్: గ్రూప్ 1 అభ్యర్థులకు సూచనలు

image

TGPSC నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష నేడు జరగనుంది.. కాగా ఉమ్మడి జిల్లా గ్రూప్1 అభ్యర్థుల కోసం సలహా సూచనలు
★ హల్ టికెట్ పై రీసెంట్ ఫొటో అతికించాలి
★ బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి
★ ఎలాంటి పరికరాలకు అనుమతి లేదు
★ నిమిషం నిబంధన.. 10 గంటలకు గేట్ క్లోజ్
★ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి
★ ఉదయం 10.30 నుంచి 1 వరకు పరీక్ష
-ALL THE BEST

News June 9, 2024

ADB: నేడు గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ADB 18, నిర్మల్ 13, మంచిర్యాల 27, ఆసిఫాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,964 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కేంద్రాల వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
>ALL THE BEST

News June 8, 2024

MNCL: దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు

image

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల DCP అశోక్ కుమార్ తెలిపారు. గత కొద్ది నెలలుగా జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో జల్సాలకు అలవాటుపడ్డ నిందితులు ఖమ్మంకు చెందిన యెసొబు @(సురేశ్ రెడ్డి), రాహుల్‌ను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 21/4 తు.ల బంగారం, 15 తు.ల వెండి, రూ.2,44,660 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News June 8, 2024

ADB: పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. హోంగార్డులను లక్కీ లాటరీ విధానం ద్వారా బదిలీ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

News June 8, 2024

వాంకిడిలో అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

వాంకిడి మండలంలోని కనార్ గాం గ్రామానికి చెందిన కళ్యాణ్ (18) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కళ్యాణ్ పెరట్లో వెళ్లి అక్కడే కిందపడి ఆరిచాడు. చుట్టూ పక్కల వారు గమనించి వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

అసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో 23,504 గ్రూప్ -1 అభ్యర్థులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 23,504 అభ్యర్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 4,608, అదిలాబాద్‌లో 18 పరీక్ష కేంద్రాల్లో 6,729, ఆసిఫాబాద్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 2,783, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,384 పరీక్షకు హాజరవుతున్నారు.

News June 8, 2024

సిర్పూర్ (టి): యువతి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

image

సిర్పూర్(టి) మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఏరియా లోని న్యూ రైస్ మిల్ గోదాం దగ్గర ఓ యువతి సూపర్ వాస్మోల్ తాగింది.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిర్పూర్ (టి) ఎస్ఐ రమేశ్ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.