India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 15న ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ సెట్‌తో హాజరుకావాలని సూచించారు.
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి గుంటూరు ఒంగోలు సూపర్ లగ్జరీ, లహరి సర్వీసులకు ఒకేసారి పోనురాను టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10శాతం రాయితీ పొందవచ్చని RTC డిపో మేనేజర్ కల్పన తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం RTC ప్రయాణ ప్రాంగణంలో రిజర్వేషన్ కౌంటర్లో లేదా
www.tsrtconline.in బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని RTC లో సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం చేయాలని కోరారు.
కేయూ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. MAY నెలలో 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఆరో సెమిస్టర్ ఫలితాలను KU అధికారులు విడుదల చేయగా 2, 4వ సెమిస్టర్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం
https://www.kuonline.co.in/Result/RS_6TH_MAY2024.aspx లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు. ఈనెల 22 వరకు రివాల్యుయేషన్ కు అవకాశం కల్పించింది.
పోగొట్టుకున్న పర్సును అందజేసి ఓ యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. నేరడిగొండకు చెందిన చిప్పరి రాజేశ్వర్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రిమ్స్‌లో పర్సు పోగొట్టుకున్నాడు. సాహిల్ ససానే అనే యువకుడికి పర్సు దొరికింది. ఐడీ, ఆధార్ కార్డులతో పాటు దాదాపు రూ.5 వేల నగదు ఉంది. గుర్తింపుకార్డు ఆధారంగా బాధితుడిని గుర్తించి టైగర్ గ్రూప్ అధ్యక్షుడు జాదవ్ గోపాల్ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు.
ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్‌కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ADB జిల్లాలో 5 నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దుచేయగా , 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. కార్డుల్లేని నిరుపేదలు ప్రభుత్వపథకాలు పొందలేని పరిస్థితి నెలకొంది.
ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 93 మంది సూసైడ్ చేసుకున్నారు. రెండు రోజులకు ఓ సూసైడ్ జరుగుతుంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత EAMCET కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ తొలివిడత కౌన్సెలింగ్ జులై 6, 7, 8 తేదీల్లో జరగనుంది. కౌన్సెలింగ్ కు వచ్చే విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంకు దగ్గర కారు బైక్ కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు వారు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.