India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిడుగుపాటుకు గురై ఓ యువ రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మూడపెల్లి ప్రవీణ్ (28) వానాకాలం సాగు కోసం పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగుపడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, సంవత్సరం కూతురు ఉన్నారు.
మంచిర్యాల పట్టణంలోని దొరవారిపల్లెలో ఘోర అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా దేశంలో మెుత్తం 47 ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెంనగేశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ మెుదలైంది.
రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికై న వారిలో పెద్దపల్లి ప్రాతినిధ్యం వహించనున్న గడ్డం వంశీకృష్ణ(35) చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా వంశీకృష్ణ(35) యూఎస్‌లో సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఈయన తండ్రి 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం చెన్నూరు MLAగా ఉన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో ‘కారు’ కనుమరుగైంది. ఏ నియోజకవర్గంలోనూ తన పట్టును నిలుపుకోలేకపోయింది. గతేడాది ఎమ్మెల్యే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో BRS పార్టీకి 55,697 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 8,512 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముథోల్‌లోనూ అప్పుడు 74,253 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 12,505 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖానాపూర్‌లో ఆ ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్లు రాగా ఇప్పుడు 7,464 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఆదిలాబాద్ ఎంపీగా BJP అభ్యర్థి గోడెం నగేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 29 పోలింగ్ కేంద్రాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. మెుత్తంగా బీఆర్ఎస్‌కు 161 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి నగేశ్ కు 3 కేంద్రాల్లో, కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు ఒక కేంద్రంలో మాత్రమే సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. ఆమెకు మాన్కాపూర్ (202)లో 5 ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ లోక్‌సభ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేశారు. దీంతో ఉద్యోగ వర్గం ఎటువైపు మొగ్గుచూపుతారనే ఉత్కంఠ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. కాగా మంగళవార వెల్లడించిన ఫలితాల్లో 4,049 మంది ఉద్యోగులు బీజేపీకి ఓటు వేసి ఆధిక్యతను కట్టబెట్టారు. కాంగ్రెస్ కు రెండో స్థానం, బీఆర్ఎస్ కు మాడో స్థానానికి పరిమితం చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున గోడం నగేశ్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో 6వ తేదీ నుంచి మూడు రోజులు నిర్వహించే సమావేశానికి ఆయన హాజరు కానున్నట్లు ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు బ్రహ్మానంద ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రంసక్కు డిపాజిట్ కోల్పోయారు. ఈయనకు ఈవీఎం ద్వారా 1,36,463 , పోస్టల్ బ్యాలెట్ 837, మెత్తంగా 1,37,300(11.11%) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ధరావత్ కోల్పోయారు. కాగా ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన గోడం నగేశ్ కు 5,68,168 ఓట్లు (45.98%)వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సుగుణకు 4,77,516 (38.65%) ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన గోడం నగేశ్‌కు ఆది నుంచి విజయం, అదృష్టం వరిస్తూనే ఉన్నాయి. TDPలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన BRSలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకొని ఎంపీగా విజయం సాధించగా అదే రీతిలో ఈసారి BJPలో చేరిన మూడు రోజుల్లోనే టికెట్ దక్కించుకొని గెలుపొందారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు నెలల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా సేవలదించారు.
Sorry, no posts matched your criteria.