India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఏఎస్సై యూనస్ ఖాన్ హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో మృతి చెందారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల విధులు నిర్వర్తించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది హైదరాబాద్ సీఐడీ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల్లో ఉండగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ సమీపంలో గుండెపోటుతో ఆయన మృతి చెందాడు.
కెరమెరి మండలం సుర్దపూర్ గ్రామానికి చెందిన చౌదరి జ్యోతి(24) వాగులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త సురేందర్‌కు భోజనం తీసుకెళ్తూ పెద్దవాగు దాటుతున్న క్రమంలో నీటిలోతు తెలియక జ్యోతి నీటిమునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఆత్రం రామకృష్ణ (15) గురువారం ఉదయం బావిలో స్నానానికి వెళ్లి మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కంచనపల్లి ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న రామకృష్ణ గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
బెల్లంపల్లి NAC సెంటర్‌లో కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లిష్ నేర్పించుటకు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా NAC ఏడీ నాగేంద్రం తెలిపారు. MA ఇంగ్లిష్, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్న యువకులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.
దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన పలువురు జిల్లాస్థాయి అధికారులతో పాటు ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశముంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫూట్ బాల్ ఎంపిక పోటీలు ఈనెల 6న ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఫూట్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పిన్నిటి రఘునాథ్ రెడ్డి తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఈనెల 6న ఉదయం 10గంటలకు పాఠశాల కోచ్ రవి,ప్రిన్సిపాల్ అనిత లకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
మంచిర్యాల MCH ఆసుపత్రిలో బుధవారం రాత్రి <<13562300>>కరెంట్ కట్ <<>>అయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాత్రంత కరెంట్ లేకపోవడంతో బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీకి ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం 149 మంది విద్యార్థులు ఎంపిక కాగా ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్ 72, మంచిర్యాల 28, ఆదిలాబాద్ 27, కొమురం భీమ్ 4 విద్యార్థులు ఎంపికయ్యారు.
ఆదిలాబాద్‌లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కాలనీకి చెందిన రాహుల్ పై ఇమ్రాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ ముజాహిద్ తెలిపారు. వెంటనే స్థానికులు అతడిని రిమ్స్‌కి తరలించారు. ఇమ్రాన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
నిర్మల్ జిల్లాలో ఎంపీపీల పదవీ కాలం ఈ నెల 3తో ముగియడంతో గురువారం నుంచి ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఆయా మండలాల్లో గురువారం బాధ్యతలు స్వీకరించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.