India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీమినిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొవ్వూరు సత్తయ్య అనే రైతు శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం ఆయనకు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాగులో నీటి మునిగి మరణించారని తెలిపారు. ఘటనకు సంబంధిత మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. రిజర్వేషన్ల విషయం ఇంకా తేల్చనప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. జిల్లా నుంచి అయిదుగురిని మాస్టర్ ట్రైనర్లుగా అధికార యంత్రాంగం ఎంపిక చేసింది. వీరు హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. అనంతరం జిల్లాలో మిగతా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్‌కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఇచ్చోడ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.

బాసర గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభించినట్లు గురువారం ఎస్ఐ గణేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద ఉన్న బ్యాగులో మూడువేల రూపాయల నగదు, బంగారు గొలుసు, మెట్రో ఐడీ కార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటి జిల్లాస్థాయి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముందుకు రావాలన్నారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుల కోసం ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున స్కాలర్ షిప్‌ను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తన ఛాంబర్‌లో కనక పూజ, మల్కన్ నందాని అనే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్లో ఎన్నికల సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ కావడంతో కార్యకర్తల మద్దతు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారగా.. హస్తం పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువ జన కాంగ్రెస్ నిలుస్తోంది.

ఏటా వర్షాకాలంలో పూసే రాఖీ పుష్పం రక్షాబంధన్ పండగకు ముందే వికసించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ శివాలయం ప్రాంగణంలో తీగకు పూసిన ఆ రాఖీ పూలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వీటిని భక్తులు శివుడి పూజలో వినియోగిస్తుంటారు. పూలల్లో ఈ రాఖీ పువ్వు చూడముచ్చటగా ఉంటోంది.

ఓ వైపు రుణమాఫీ సంబరాలు జరుగుతుండగా మరోవైపు మాఫీ జాబితాలో తమ పేర్లు లేవంటూ వేలాది మంది ఆవేదనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారుగా 1.80 లక్షల మం ది రైతులున్నారు. లక్షలోపు రుణాలున్న 30,109 మంది రైతులకు మొదటి విడతలో, రూ.1.50 లక్ష లలోపు రుణాలున్న 19,058 మంది రైతులకు రెండో విడత జాబితాలో పేర్లు వచ్చాయి. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల పంటభూములున్నాయి. వీరు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.