Adilabad

News June 3, 2024

భీమిని: ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చిన మేక

image

భీమిని మండలం లోని పెద్దపేట గ్రామంలో ఓ రైతు పెంచుకుంటున్న మేక ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు 1 లేదా 2 జన్మనిచ్చిన మేకలను చూసుంటాం. కానీ ఇది ఏకంగా 5 పిల్లలను జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 5 మేక పిల్లలకు జన్మ ఇవ్వడంతో చుట్టూ పక్కల ప్రాంతాలవారు మేకలను చూడటానికి క్యూ కట్టారు.

News June 2, 2024

ADB: బడి బాట వాయిదా

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన బడి బాట వాయిదా పడింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గమనించగలరని కోరారు.

News June 2, 2024

ఆసిఫాబాద్: భారీ వర్షం.. కొట్టుకుపోయిన తాత్కలిక వంతెన

image

ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం వాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్థులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు .గుండి తాత్కాలిక వంతెన ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనితో గుండి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్ జిల్లా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరారు.

News June 2, 2024

వాంకిడిలో పిడుగు.. అపస్మారక స్థితిలోకి మహిళ

image

వాంకిడి మండలం ఇందాని గ్రామంలో పిడుగుపాటు శబ్దానికి గ్రామానికి విక్రుబాయి ఆదివారం సాయంత్రం తన ఇంటి బయట నిలబడింది. ఆ సమయంలో పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు ఇంటి పక్కనే పడింది. పిడుగు శబ్దానికి ఆమె భయపడి అక్కడే కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 2, 2024

మంచిర్యాల: పలు రైళ్లు రద్దు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల వల్ల కాజీపేట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను ఆదివారం నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-సిర్పూర్, కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్, సికింద్రాబాద్-విజయవాడ- సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 2, 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.

News June 2, 2024

ADB: 3రోజుల్లో ఫలితాలు.. అభ్యర్థుల్లో TENSION

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరో మూడురోజుల్లో వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి పోలీస్ అధికారుల నడుమ 24 గంటలపాటు భద్రత కొనసాగుతోంది. కాగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అటు ఎంపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

News June 1, 2024

PL SURVEY : ఆదిలాబాద్ టఫ్, పెద్దపల్లి కాంగ్రెస్‌దే!

image

పెద్దపల్లి ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌దే గెలుపని పొలిటికల్ ల్యాబరేటరీ (PL) సర్వే తెలిపింది. అయితే ఆదిలాబాద్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుందని ఆ సర్వే పేర్కొంది. ADB నియోజకవర్గంలో బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

చాణక్య X : ఆదిలాబాద్, పెద్దపల్లి కాంగ్రెస్‌దే!

image

ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలు కాంగ్రెస్‌వే అని చాణక్య X సర్వే తెలిపింది. ADB నియోజకవర్గంలో బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

ఆదిలాబాద్: జూన్ 2 నుంచి అందుబాటులోకి 90 వేల ప్యాకెట్లు

image

రైతులు కోరుకుంటున్న రాశీ 659 పత్తి విత్తనాలను గత సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 1.50 లక్షల ప్యాకెట్లను కంపెనీని నుంచి తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులు 60 వేల ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. జూన్ 2 నుంచి మరో 90 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దశల వారీగా రాశీ 659 స్టాకు వస్తుందని స్పష్టం చేశారు.

News June 1, 2024

AARA SURVEY: ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవనుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.