India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలేదని ప్రజలు గుర్తించాలన్నారు.
రాష్ట్ర పంచాయితి రాజ్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉ.9.15 ని.కు ఉట్నూర్‌లో బీటీ రోడ్ ప్రారంభిస్తారు. 9:30కు అక్కడి నుండి బయలుదేరి 10:30కు మావల అర్బన్ పార్క్‌లో వన మహోత్సవానికి హాజరవుతారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు వీల్ చెయిర్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పొలీసులు వివరాల ప్రకారం.. సేవాలాల్ తండాకు చెందిన పవార్ కృష్ణ (28) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పవర్ అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ASI దిగంబర్ తెలిపారు.
ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. CC పుటేజ్ ఆధారంగా నిర్మల్ RTC డిపోకు చెందిన బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిపై నుంచి వెళ్లడంతోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బస్ డ్రైవర్‌పై ఆదివారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. నరేశ్, సరస్వతికి సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే భార్య భర్తల గొడవ కారణంగానే శనివారం సరస్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే రిమ్స్‌కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
ఆదిలాబాద్ మాజీ MP రమేశ్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కి చెందిన రమేశ్ OCT 20 1966లో జన్మించారు. రాజకీయ ప్రస్థానం TDP తరఫున 1995లో జడ్పీటీసీగా ప్రారంభమైంది. పలు పదవుల్లో బాధ్యతలు స్వీకరించి ఎనలేని సేవలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసుకున్నారు. కాగా, నిన్న అస్వస్థతకు గురై మృతి చెందాడు.
DED కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం జున్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్ లో ఉంటుందని పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్ నేటితో ముగుస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు htpp://deecet.cdse. telangana. gov.in ను సందర్శించాలని సూచించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు కలిశారు. ఢిల్లీలో శనివారం కేంద్రం రక్షణ శాఖ మంత్రిని కలిసి ఆదిలాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఆదిలాబాద్‌లో వైమానిక దళం స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రారంభించినట్లు వారు గుర్తు చేశారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో రమేష్ రాథోడ్ టిడిపి నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్‌గా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివాసి, గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆయన కృషి చేశారని, రమేష్ రాథోడ్ మృతి తనను ఎంతో బాధించిందని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.