India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. గురిజ గ్రామానికి చెందిన 18 ఏళ్ల కార్తిక్ మంగళవారం తన బావ వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అయితే అక్కడ ఇనుప కంచెను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందాడు. మృతుడు ఇటీవలే పదవ తరగతి పూర్తి చేశాడు. ఘటనతో విషాదం నెలకొంది.

బాధితులు పోగొట్టుకున్న, చోరీ అయిన సెల్‌ఫోన్లు గుర్తించడంలో ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ ముందంజలో ఉంది. 63.98% ఫోన్ల ఆచూకీని తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆదిలాబాద్ (63.42%), రామగుండం (61.54%), నిర్మల్(61.32%) ఉన్నాయి. చరవాణులను బాధితులకు అప్పగించడంలో రామగుండం 29.15% తో 1 వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో నిర్మల్(28.48 %), 3వ స్థానంలో ఆదిలాబాద్(24.63%), 4వ స్థానంలో ఆసిఫాబాద్ 22.66% ఉన్నాయి.

కూతురిపై తండ్రి లైంగిక దాడి చేసిన దారుణ ఘటన దిలావర్పూర్‌లో జరిగింది. SP జానకీ షర్మిల తెలిపిన వివరాలు.. గుండంపల్లికి చెందిన సంజీవ్(38) ఈనెల 19న రాత్రి తన కూతురి(14)పై లైంగిక దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న భార్య వారించగా.. తనను అడ్డుకుంటే రెండో భార్యను చంపినట్లు మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరించి కూతరిపై లైంగిక దాడిచేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఈనెల 30న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లాలోని 17,647 రైతులకు గాను రూ.201.83 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంతో పాటు 17 మండలాల పరిధిలోని రైతు వేదికల్లో ప్రారంభించనునట్లు వెల్లడించారు.

మందమర్రి పట్టణంలోని మూడో జోన్‌కు చెందిన దురిశెట్టి సాధన పాముకాటుకు గురై మృతి చెందింది. సోమవారం సాయంత్రం ఇంట్లో అన్నం తింటుండగా పాము కాటు వేసినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

రాష్ట్ర స్థాయి సకురా సైన్స్ ప్రొగ్రామ్ పోటీలకు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రసజ్ఞ ఎంపికయ్యారు. గత సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్య పోటీలను నిర్వహించారు. రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జపాన్ పర్యటనకు పంపనున్నారు.

ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. అయితే కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ కాగా, మిగతా వారికి సగం కంటే తక్కువ, ఇంకొంత మందికి అసలుకే రాక బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో మొదటి విడత 18,821 మంది రైతులకు రూ.120.79 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఖాతాలో మాత్రం డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి 31తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జీపీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టింది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా వాటి పరిధిలో 3,830 వార్డులున్నాయి. వీటికి 2018లో ఎన్నికలు జరిగాయి.

వర్షాకాలం సీజన్‌లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానా కాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్‌లు చెబుతుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నేరడిగొండ మండల కేంద్రంలో కిలో రూ.400 పలుకుతోంది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.

కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి సుమారు 8,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 695 అడుగులకు నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 699 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువలకు 379, మిషన్ భగీరథ 9, దిగువకు 8178 మొత్తం కలిపి 8634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.