India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలో రెండు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల తాంసీ, బేల పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల మెడలో నుంచి చైన్లు దొంగతనం చేశారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన అవినాష్, విభాష్, బజార్హత్నూర్‌కు చెందిన జాదవ్ ప్రదీప్ ముగ్గురితోపాటు ఒక బాల నేరస్థుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బంగారం స్వాధీనం చేశారు.
బాలుడిపై లైంగిక దాడి కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది.
2021 జూన్ 2న బాధిత బాలుడి బంధువు అయిన నేరడిగొండకు చెందిన మహేశ్(30) బాలుడిని కిరాణా దుకాణానికి తీసుకెళ్లే వంకతో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతుండగా.. బాలుడి అక్క తమ్ముడిని వెతుకుతూ వెళ్లగా పరారయ్యాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై గురువారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల తాంసీ, బేల మండలాల్లో పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ ఘటనలు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి అభరణాలతో పాటు ఒక బైకు నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బాసర-నిజామాబాద్ రైల్వే మార్గంలో ముఠాపూర్ గ్రామ శివారులో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి(55) మృతదేహం రైల్వే పోలీసులు గుర్తించారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తి శవం కుళ్లిపోయినట్లు, ఒంటిమీద తెలుపురంగు చొక్కా, దోతి ధరించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. వివరాలకు వెళ్తే.. మావల జాతీయ రహదారిపై నుంచి ఎండి అర్ఫత్, ఉస్మాన్ ప్రయాణిస్తున్న కారు ఆదిలాబాద్‌కు వస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది దీపక్, వసీం ఘటనా స్థలానికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక రిమ్స్‌లో తరలించారు.
మంచిర్యాలలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ యువీఎన్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్లూరు సుధాకర్, టోర్నమెంట్ మ్యాచ్ కంట్రోలర్ కుమార్, జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
సింగరేణి గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే గనులను ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బాబాపూర్ గ్రామానికి చెందిన పడాల నాగరాజు(16) బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి పడాల గంగ నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.