India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితుల ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బేల, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం తెలిసిందే. స్నాచర్స్‌ను ఎవరైనా గుర్తుపడితే SDPO 8712659914, జైనథ్ సీఐ 8712659916, రూరల్ సీఐ 8712659915 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP జీవన్ రెడ్డి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళికల్లో జరిగిన మార్పులపై ఆదిలాబాద్‌లో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించారు. దీనికి ఐసీడీఎస్ సీడీపీఓ వనజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్య వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. సూపర్వైజర్లు ఫర్హా, విజయలక్ష్మి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జైపూర్‌లోని పెగడపల్లి గ్రామంలో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఏస్టీపీసీ కార్మికుడు మధు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సంబంధిత అధికారులు తనకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల మందికి పైగా రైతులు 16 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారు. ఇందులో అదిలాబాద్ జిల్లాలో 1,364 ఎకరాలకు రూ.57.27 లక్షలు, నిర్మల్ 4,523 ఎకరాలకు రూ.189.20 లక్షలు, మంచిర్యాల 599 ఎకరాలకు రూ.25.19లక్షలు, ఆసిఫాబాద్ 494 ఎకరాలకు రూ.20.12లక్షలు విడుదలయ్యాయి.
కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఓ ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
నిర్మల్ ఉపాధ్యాయునికి జిద్దా ఉర్దూ అకాడమీ పురస్కారం లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మహమ్మద్ ఇంతియాజ్‌కు ప్రతి ఏడాది సౌదీ అరేబియాలోని జిద్దా ఉర్దూ అకాడమీ వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. దీంతో జిద్దా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఆయనను హైదరాబాద్‌లో సన్మానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా రైతులు 17 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.2,215 కోట్లు నిధులు అవసరమని అధికారుల అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది.
POLYCET సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని పాలిసెట్ సమన్వయకర్త భరద్వాజ తెలిపారు. అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకొని తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 91వేల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉండగా ఏటా పనిచేసే వారు 1.72 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 71వేల జాబ్ కార్డులున్న వారికి పని కల్పించగా దాదాపు 1.29 లక్షల మంది భాగస్వాములయ్యారు. ఇందులో పురుషులు 61వేలు, మహిళలు 68 వేలు ఉన్నారు. కేంద్రం కూలికి రోజు రూ.300 కేటాయిస్తుంది.
JCB ఢీకొని కూలీ మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. చెక్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం తీసుకువచ్చిన ఇసుక ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. దానిని JCB సహాయంతో బయటికి లాగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా JCBని వెనక్కు తీయడంతో నవీన్(33) అనే కూలీకి బలంగా తాకింది. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.