India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైతు వద్ద లంచం తీసుకున్న కేసులో ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ADE రేగుంట స్వామిని విధుల నుంచి తొలగిస్తూ TSNPDCL CMD వరుణ్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వామి ఇచ్చోడలో 2010లో పనిచేస్తున్నప్పుడు ఓ రైతు వద్ద రూ.30 వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ACB అధికారులను సంప్రదించగా వారు పథకం ప్రకారం ఆ రైతు అతడికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో స్వామిని విధుల నుంచి తొలగించారు.
సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గల TG స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ADB SC సంక్షేమ శాఖ అధికారిని సునీత కుమారి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 10 లోపు http://tsstudycircle.co.in/ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 21 న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేసి 10 నెలల పాటు ఉచితభోజన వసతితో కోచింగ్ ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మహోన్నత సేవా పతకాలను ప్రకటించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ DCPఅడ్మిన్ C.రాజుకు తెలంగాణ స్టేట్ పోలీస్ మహోన్నత సేవా పతకం, టాస్క్‌ఫోర్స్ T.మల్లారెడ్డి తెలంగాణ స్టేట్ సేవా పతకం అందుకున్నారు.
TGPSC CBRT హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ (works Grade-ll). పరీక్షలకు సంబంధించి శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తన ఛాంబర్‌లో లైన్ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష జరుగుతుందని, జూన్ 30 నుంచి జులై 4 వరకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఉందన్నారు.
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కదం గంగాధర్ (45) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. జీవితం మీద విరక్తితో రోడ్డమోడ్ గుట్ట వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తలమడుగు మండలం కుచులాపూర్ అటవీప్రాంతంలో సంచరిస్తున్న చిరుత అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాకు చిక్కింది. తాజాగా అటవీశాఖ అధికారులు చిరుత ఫొటోను విడుదల చేశారు. కాగా అడవికి పశువుల కాపరులు ఎవరూ వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రణ్‌వీర్ తెలిపారు. బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశామన్నారు.
ఆదిలాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పాలిటెక్నిక్‌లో 2024-25 విద్యా సంవత్సరం కోసం డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ మురళి తెలిపారు. 40 సీట్లు ప్రవేశాల కొరకు జులై 15 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం www.skltshu.ac.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్ అనే యువకుడు గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం మల్కల్లలోని గోదావరిలో మిత్రుడి తల్లి అస్థికలు నదిలో కలపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి ఉదయ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గజ ఈతగాళ్లు ద్వారా వెలికితీశారు.
దిలావర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం మహిళలు వట సావిత్రి వ్రతం నిర్వహించారు. 100 ఏళ్లకు పైబడిన మర్రి వృక్షం వద్ద పెద్ద ఎత్తున మహిళలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సౌభాగ్యాలను సల్లగా చూడాలని దారం చుడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా తాము ఈ వ్రతాన్ని ఆచరిస్తామని మహిళలు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు RDO కార్యాలయాలకు సబ్ కలెక్టర్ హోదా గుర్తింపునిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సులభతరం చేసేందకు రాష్ట్రంలో 15 RDO కార్యాలయాలకు ఈ హోదా కల్పించారు. ఉట్నూర్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ RDO కార్యాలయాలకు ఈ హోదా దక్కింది. దీంతో ఇక్కడ IAS అధికారులను సబ్ కలెక్టర్‌లుగా నియమించనున్నారు.
Sorry, no posts matched your criteria.