Adilabad

News June 21, 2024

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీని కలిసిన శ్యామ్‌నాయక్

image

ఆసిఫాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన SP,DV.శ్రీనివాస్ రావును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అజ్మీర శ్యాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, నాయకులు మారుతీ పటేల్ తదితరులు ఉన్నారు.

News June 20, 2024

ఆదిలాబాద్ : POLYCET షెడ్యూల్ ఇదే.. స్లాట్ బుక్ చేసుకోండి

image

POLYCETకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ నేటినుండి ప్రారంభం కానుంది.
★ ఈనెల 20 నుంచి 24 వరకు వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
★ జూన్ 22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుంది.
★ జూన్ 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి.
★ జూన్ 30 న సీట్ల కేటాయింపు ఉంటుంది.
★ జూన్ 30 నుంచి జులై 4 వరకు ఫీజు చెల్లించి కళాశాల కన్ఫర్మ్ చేసుకోవాలి.
★ జులై 7 నుంచి రెండవ విడత ప్రారంభం అవుతుంది.

News June 20, 2024

BREAKING: ADB: అదృశ్యమై.. శవమై తేలిన బాలుడు

image

ఉట్నూర్ మండలంలో విషాదం నెలకొంది. శాంతినగర్ చెరువులో ఓ బాలుడి మృతదేహం గురువారం లభ్యమైంది. బాలుడు పాత ఉట్నూర్‌కు చెందిన సాయికుమార్(9)గా గుర్తించారు. ఈ నెల 16న బాలుడు అదృశ్యం కాగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యం అయిన బాలుడు నేడు శవమై కనిపించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News June 20, 2024

కలెక్టర్‌ను కలిసిన నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్‌ను గురువారం నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కౌన్సిలర్లు నరేందర్, రమణ ,నరహరి, పోశెట్టి తదితరులున్నారు.

News June 20, 2024

బాసర: 2రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు

image

బాసర ఆర్జీయూకేటీ పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇప్పటి వరకు 14,500 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. జులై 3న ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 27న నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 22వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.

News June 20, 2024

ADB: ఉమ్మడి జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరం

image

రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలను కొనసాగించాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. కాగా జిల్లాలో 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.2.500 కోట్లు, రైతు భరోసా కింద 6 లక్షల మంది రైతులకు రూ.1,730.2 కోట్లు, రైతు బీమా కింద 3.09లక్షల మంది రైతులకు రూ.111.73 కోట్లు అవసరం ఉంది.

News June 20, 2024

మంచిర్యాల: ఆ SI కన్ను మహిళలపైనే.!

image

ఓ మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం SI భవానీసేన్ లైంగిక వేధింపుల కేసులో డిస్మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన SIగా ఉన్నప్పుడు ఓ యువతికి కానిస్టేబుల్ పరీక్షకు అవసరమైన పుస్తకాలు కొనిస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని సస్పెండ్ చేశారు. మంచిర్యాలలో పని చేస్తుండగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా అతడి తీరు మారలేదు.

News June 20, 2024

తలమడుగులో 2 చిరుతల సంచారం

image

తలమడుగులో 2 చిరుతలు సంచరిస్తున్న విషయం కలకలం రేపింది. కుచులపుర్ గ్రామంలోని ఆశన్నకు చెందిన ఎద్దుపై మంగళవారం చిరుత దాడి చేసింది. మామిడి శేఖర్ అనే వ్యక్తి బుధవారం మేకలను మేపడానికి కొత్తూరు శివారులోని అడవికి వెళ్లాడు. అక్కడ మేకలపై చిరుతలు దాడి చేయడం చూసి గ్రామస్థులకు సమాచారం అందించాడు. FBO అవినాశ్, DYRO రన్వీర్, మండల పశు వైద్యులు డా.దూద్ రామ్ ఘటన స్థలానికి చేరుకొని చిరుతల అడుగులను గుర్తించారు.

News June 19, 2024

సిరికొండ: బడికెళ్లాలంటే 1.5 కి.మీ నడవాల్సిందే

image

సిరికొండ మండలం సాత్ మెారి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కాలినడకన 1.5 కి.మీ నడిచి బోరింగూడకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. మండలంలోని సూర్యగూడ, రాంజీగూడ, బోరింగూడ గ్రామాలకు బస్ సౌకర్యం లేదని, కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉండక పోవడంతో విద్యార్థులకు కాలినడక తప్పడం లేదన్నారు. అధికారులు స్పందించి బస్ ఏర్పాటు చేయాలని కోరారు.

News June 19, 2024

ADB: నేటి నుంచి 3వ విడత అడ్మిషన్లు షురూ

image

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి, రెండో విడతలు ముగియగా నేటి నుంచి మూడో విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్‌ 19 నుంచి జులై 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నేటి నుంచి జులై 3 వరకు 3వ దశ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలి. జులై 6న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభం కానున్నాయి.
>SHARE IT