India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం కిసాన్ ఈ కేవైసీ సందేశంతో బ్యాంకు ఖాతాలోని రూ.9,945 ఖాళీ అయిన ఘటన బుధవారం వెలుగుచూసింది. ఇంద్రవెల్లి మండలం దొంగరగావ్‌కు చెందిన మడావి సురేశ్ ఫోన్‌కి పీఎం కిసాన్ ఈ కేవైసీ అప్‌డేట్ అనే సందేశం వచ్చింది. అతడు ఆ లింకును ఓపెన్ చేయగానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.9945 నగదు విత్ డ్రా అయినట్లు మరో సందేశం వచ్చింది. దీంతో అతడు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
భైంసా ఆర్టీసీ డీఎం ఎం.అమృతను సస్పెండ్ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై కరీంనగర్ జోనల్ ఈడీ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఆర్ఎం విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ ప్రాంతీయ డిప్యూటీ మేనేజర్ ప్రణీత్ వివరాల ప్రకారం బాసర, ముథోల్, తదితర బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే డీఎం బిల్లులు రూపొందించి కాజేసినట్లు తేలింది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్లు www.braou.online.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఆన్లైన్లోనే ఈనెల 20వ తేదీ వరకు
సబ్మిట్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్‌లోని ఒక కాలనీకి చెందిన బాలిక(16)కు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయటంతో పాటు కుటుంబీకులను సైతం బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 16న ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు మోరె రాజమౌళి(30)ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
గ్రూప్-2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ ల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి ఆదిలాబాద్ కె. రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 12 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్‌లు జులై 8న
ఉదయం 10 గంటలకు పేపర్-1 మధ్యాహ్నం 1.30కి పేపర్ 2 ఉండును అదేవిధంగా 9న ఉదయం 10 గంటలకు పేపర్-3 ఉంటుందన్నారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన రూ.30 వేల కోట్లు చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. గుర్తింపు సంఘం పత్రం వెంటనే అందించి స్ట్రక్చర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక వర్గానికి అండగా నిలిచి కొత్త గనులు సాధిస్తామని తెలిపారు.
పోలీస్ జాగిలం ‘తార’ అందజేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. తార పదవీ విరమణ కార్యక్రమాన్ని పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జాగిలాన్ని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బాంబులు, మందు గుండు సామాగ్రి కనుగొనడంలో తార ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు.
అధిక వర్షాలు, వరదలతో ప్రతిఏటా ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ రైతులు మాత్రం పంటనష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. కానీ పంట నష్టం జరిగితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వక అటు కేంద్రం నుంచి వచ్చే పరిహారం రాకపోవడంతో రైతుల మీద అప్పులు, పెట్టుబడి భారం పెరిగిపోతోంది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడ కాలనీకి చెందిన వరలక్ష్మి(12)ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.