India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో ఈ నెల 17 నుంచి జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SHARE IT
ఆదిలాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ అస్వస్థతకు గురైందని ఎలాంటి
హైడ్రామా చేయలేదని జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తనకు తినటం ఇబ్బందిగా, కడుపునొప్పి ఉందని తెలిపింది. ఆమెను విచారించగా జైలుకి రాక ముందు చిన్నచిన్న బ్లేడు ముక్కలు మింగిందని చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించగా వైద్యులు అవసరమైన చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో మునిగి అసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పని చేసే విజయ్ మృతి చెందాడు. ఎల్ఎండీ వద్ద కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ ఫొటో దిగుతుండగా రిజర్వాయర్లో పడ్డారు. ఈ క్రమంలో వారిని కాపాడబోయిన విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. కాగా, విజయ్ పిల్లలను జాలరి శంకర్ కాపాడారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకొలి గ్రామంలో మద్యపానం నిషేధించారు. గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు అందరు కలిసి ఈ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత చెడు అలవాట్లకు లోను రాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 వేలకు పైగా ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమ సమస్యలు పరిష్కారం కాకా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా భూ విస్తీర్ణం, సర్వే నెంబర్లలో తప్పులు, పేరు మార్పిడి, పట్టాల్లో తప్పులు దొర్లడం వంటి అంశాలకు సంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా పెండింగ్ దరఖాస్తులు మంచిర్యాల జిల్లాలో ఉండగా అత్యల్పంగా అదిలాబాద్‌లో ఉన్నాయి.
బాలికపై ఆమె బంధువు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను ఆమె బంధువు రాజమౌళి(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబీకులు అతడిని మందలించగా వారిని సైతం వేధించాడు. దీంతో వారు ఆదివారం 2టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.
కాగజ్‌నగర్ మండలంలో పులి సంచారం కలకలం రేపింది. మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకొని సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ బక్రీద్ అని ప్రజలంతా సంతోషంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజావాణి ఉండదని, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కి రాకూడదని సూచించారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం ఐపీఎస్ అధికారి సుధీర్వెజి తన కుటుంబ సభ్యులతో కలిసి సఫారీలో అడవి ప్రాంతంలో పర్యటించారు. అడవిలో జంతువులు పక్షులను చూసి ఆయన సంబరపడ్డారు. టైగర్ జోన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తాటి చెట్టుపై నుండి కింద పడి గాయపడిన జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొంగోని రమేష్ గౌడ్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. రమేష్ గౌడ్ ఈ నెల 9న తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు జారి కింద పడడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.