Adilabad

News June 16, 2024

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన ప్రసూతి మరణాలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసూతి మరణాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గినా.. ఈ రెండు జిల్లాల్లో ప్రసూతి మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో మృతి చెందిన వారిలో 40 శాతం మంది 21 నుంచి 25 ఏళ్ల వయసు లోపువారే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నివేదిక ద్వారా తెలుస్తోంది. 71 శాతం మంది సిజేరియన్ ఆపరేషన్ల సమయంలో, సహజ ప్రసవాల్లో 29 శాతం మరణించినట్లు నివేదికలో వెల్లడైంది.

News June 16, 2024

నిర్మల్: రెండేళ్ల బాలుడికి కిడ్నీలో రాళ్లు

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి చెందిన దివ్యరాణి,రాజ్ కుమార్ దంపతుల రెండేళ్ల కుమారుడు విహాన్ కొంతకాలంగా కిడ్నీలో నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో రాళ్లు తొలిగించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.

News June 16, 2024

ఆదిలాబాద్: TUTF భవనంలో ఉచిత వెబ్ అప్షన్ ప్రక్రియ

image

ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వరకు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని TUTF సంఘ భవనంలో ఉచితంగా వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్ తెలిపారు.

News June 15, 2024

ADB: ‘రైతుబందు కోసం ఎదురుచూపులు’

image

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబందు పథకం కింద అందించే పెట్టుబడి సహాయం ఆలస్యం కావడంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రారంభమై వారం రోజులు గడిచిన రైతుబందు జాడ లేదని రైతులు ఆరోపించారు. జిల్లాలో 1,63,359 మంది రైతులు ఉండగా జిల్లా వ్యాప్తంగా రూ.2,872,851,984 నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

News June 15, 2024

ADB: సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య?

image

ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ జైనథ్ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రేమించిన వాడి కోసం సొంత భార్య.. సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఫోన్లో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడిన కాల్ డేటా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

News June 15, 2024

భీంపూర్: పాము కాటుతో మహిళ మృతి

image

భీంపూర్ మండలంలోని కైరి గూడ గ్రామానికి చెందిన మహిళ పెందూర్ లక్ష్మి(30) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. పెరట్లో పని చేస్తుండగా కాలిపై పాము కాటువేయగా.. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె కుటుంబీకులకు చెప్పారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఖలీల్ తెలిపారు. భర్త ఇది వరకే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు

News June 15, 2024

ASF:బాలికపై హత్యాచారం.. నిందితుడిపై చర్యలకు డిమాండ్

image

దహెగాం మండలానికి చెందిన ఆరేళ్ల బాలికపై పెద్దపల్లి జిల్లాలో అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కౌటాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

News June 15, 2024

నిర్మల్: ధరణి సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్

image

ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రధానకార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ (VC) నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై చర్చించారు.

News June 14, 2024

నిర్మల్: ప్రేమోన్మాది ఘాతుకం.. మహిళపై కత్తితో దాడి

image

తనను ప్రేమించడం లేదని ఓ వ్యక్తి వివాహితపై దాడి చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను జైభీమ్ అనే వ్యక్తి రెండేళ్లుగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఆమెపై కత్తిదాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని భైంసా తరలించగా.. అక్కణ్నుంచి మెరుగైన వైద్యంకోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.

News June 14, 2024

ఆదిలాబాద్: జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా చర్యలు: ఎస్ఈ

image

ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని ఎస్ఈ జయవంత్ చౌహన్ తెలిపారు. నిర్లక్ష్యం, అవగాహన లోపం వలన విద్యుత్ వినియోగదారుల గృహాల్లోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల, నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.