India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న ఫలితాల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాలు.. ★ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు: సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ★ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ ఓట్లు : ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ★ ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఓట్లు: TTDCలో
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి, విద్యుత్ సరఫరాను మెరుగుపర్చారు. ఇంద్రవెల్లి మండలంలో భారీ వృక్షాలు నెలకొరిగాయి. రోడ్డుపై చెట్టు విరిగి పడిపోవడంతో గంట సేపు రాకపోకలు స్తంభించాయి.
2024-25 విద్యాసంవత్సరానికి గానూ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివి పదో తరగతిలో 7 జీపీఏకు పైగా సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌కి చెందిన సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు హైదరాబాద్‌లో గురువారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చేసిన కృషిని ఆయన అభినందించారు.
భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష, రూ 2500 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పునిచ్చారు. జైనథ్ మండలంలోని నీరాల గ్రామానికి చెందిన మహిళ తన భర్త దీక్షిత్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. నేడు పీసీఆర్ కోర్టులో పోలీసులు అతడిని హాజరుపర్చగా విచారణ అనంతరం అతడికి కోర్టు శిక్ష విధించినట్లు లైజన్ అధికారి గంగా సింగ్ తెలిపారు.
ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మంచిర్యాల జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. 3 నియోజకవర్గాల్లో 6,49,030 మంది ఓటర్లు నమోదై ఉండగా ఏకంగా 2,21,397 మంది ఓటర్లు ఓటు వేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,54,882 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు.
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన CONG, BJP, BRS నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. దీంతో ఏ పార్టీకి జిల్లాలో మెజార్టీ ఎంత వస్తుందో అనే దానిపై ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా చర్చ సాగుతోంది.
పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.