India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పరిస్థితిని రేవంత్ సర్కార్ ఆరా తీస్తోంది. ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ బలోపేతం, శ్రేణులను ఏకతాటిపై నడిపించాలంటే మంత్రి పదవీ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కోసం MNCL ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, గడ్డం సోదరుల మధ్య పోటీ నెలకొంది. ఇరువర్గాల మధ్య మంత్రి పదవి ఎవరిని వరిస్తోందనేది కీలకంగా మారుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నకిలీ ఆసుపత్రులపై నేషనల్ మెడికల్ కమిషన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, నస్పూర్ , శ్రీరాంపూర్, మందమర్రి, సిర్పూర్, నీల్వాయిలో ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న 12 మందిపై కేసు నమోదు చేశారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ఎంపీను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీలు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తన వంతు కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు.
జైపూర్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం 19 చుక్కల జింకలను అధికారులు వదిలిపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంత సమీపంలోని పొలాల్లో జింకలు సంచరించడంతో రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాటిని పట్టుకొని జైపూర్ అడవిలో వదిలిపెట్టారు.
రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశానికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయి, 28న జిల్లా స్థాయి, జూలై 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. 4వ తరగతి చదువుతున్న 20 మంది బాలురు, 20 మంది బాలికలు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. పాఠశాల పున:ప్రారంభం కావడంతో బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుంచి జైనథ్‌కు బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హతమార్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తల్లి మందలించిందని యువతి పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన తీర్యాని మండలంలో జరిగింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. భింజీగూడ గ్రామపంచాయతీకి చెందిన ఇంద్ర భాయ్ (16)అనే యువతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఆసుపత్రి, అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.
ఓ వాహనదారుడికి చిరుతపులి కనిపించిన ఘటన మండలంలో జరిగింది. వివరాలిలా.. బోథ్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం రాత్రి జీడిపల్లె మీదుగా సొనాలకు వెళ్తున్నాడు. జీడిపల్ల-టివిటి గ్రామాల మధ్య నీటి కుంట సమీపంలోని వంతెన వద్ద చిరుతపులి చూసినట్లు తెలిపాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు అన్ని పాఠశాలలు మొత్తం 4,758 ఉన్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,432, ఆ తర్వాత కొమురం భీమ్ జిల్లాలో 1,248 ఉన్నాయి. అంతేకాకుండా మంచిర్యాల జిల్లాలో 1,044, నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలో అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1,034 స్కూల్స్ ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా. ఈ సంవత్సరంలో నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందచేయగా ఇద్దరు ఫీల్డ్, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.