India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 71.41 % పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 74.03%నమోదైంది. 16,50,175 మంది ఓటర్లు ఉండగా 12,21,563 మంది ఓటు వేశారు. 5,99,108 మంది పురుషులు, 6,22,420 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2.5% పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో BJP గెలుపొందగా మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.
ఉమ్మడి ADB జిల్లాలోని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 12 మంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నానాజీ పటేల్ -గంగాసాగర దంపతుల కుమారుడు సిందె ఆకాష్ ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు అన్న ఉద్దేశంతోనే తాను వచ్చి ఓటు వేశానని తెలిపారు.
PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్‌సాగర్‌రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్‌సాగర్‌రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల పని పూర్తైనప్పటికీ నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తయితే.. ఫలితాల కోసం నిరీక్షించడం మరో ఎత్తు కానుంది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడగా.. ఇప్పుడు 22 రోజుల పాటు వేచి చూడాల్సిందే.
కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని భీమిని మండలం తుంగళ్లపల్లి గ్రామ ఓటర్లు ఓటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో 303 మంది ఓటర్లు ఉన్నారు. వీరు వాగు దాటి 3 కి.మీ దూరం కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు సాలిగామ నుంచి 15 కి.మీ ప్రయాణించి ఓటు వినియోగించుకున్నారు.
ఓటుహక్కు తెలిసినవారు పోలింగ్ సమయంలో ఎక్కడున్నా తమ గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ దంపతులు యూరప్‌లో ఉంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఓటువేయాలని సంకల్పంతో ఈనెల 13న ఓటు వేసిన తర్వాత యూరప్ కు వెళ్లాలని నిర్ధారించుకున్నాడు. దీంతో సోమవారం ప్రవీణ్ దంపతులు ఓటువేసి యూరప్‌కు బయలుదేరారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. ఉమ్మడి వ్యాప్తంగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వివాదాలు తప్పితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కండువాల వివాదం, పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ, అధికారులతో వాగ్వివాదం, కాసేపు ఈవీఎం మొరయింపు, తదితర చిన్నపాటి సంఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిశాక ఎవరికి వారే తామే గెలుస్తున్నామన్న ధీమాతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఉన్నారు.
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 190 పోలింగ్ బూత్‌లో వంద సంవత్సరాల వయస్సు పైబడిన పోచం సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు వేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తను ఓటు వేయకుండా ఉండలేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి, బాబా నాయక్ తండ గ్రామాస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని.. పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామాలకు రోడ్డు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రెండు గ్రామాల్లో కలిపి ఒకటే ఓటు నమోదైంది.
Sorry, no posts matched your criteria.