India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, లేబర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, దివ్యాంగుల కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకటి తప్పనిసరి.
భీంపూర్ మండలం అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి పాము కాటేసింది. టాయిలెట్‌కు వెళ్ళినపుడు పాము కాటేయడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జైనథ్ మండలం ముక్తాపూర్‌లో ఉపాధ్యాయుడిగా ప్రఫుల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 71.42 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దడ్పూర్ గ్రామం పోలింగ్ కేంద్రానికి వెళుతున్న పోలీస్ వాహనం ఈదురు గాలులకు అదుపుతప్పి బోల్తా పడింది. పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కెరమెరి మండలం కరంజివాడ వద్ద పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సు వాగులోకి పూర్తిగా వెళ్లకుండా బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలింగ్ సిబ్బంది బస్సు దిగి కాలినడకన కరంజివాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో ఈవీఎం మిషన్ల పంపిణీ ఆదివారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా మండల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో ఇద్దరు ఎస్ఐలు పాల్గొనగా.. వారిద్దరూ అన్నదమ్ములు అవ్వడం విశేషం. మావల పోలీస్ స్టేషన్ SI విష్ణువర్ధన్, జైనథ్ పోలీస్ స్టేషన్ SI పురుషోత్తం ఇక్కడే విధులు నిర్వర్తించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో అంతగా జోష్ కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంతో చాలా గ్రామాల్లో ప్రచారం పూర్తిగా నిర్వహించలేకపోయారు. పలువురు నాయకులు సైతం వడదెబ్బకు గురికావడంతో కార్యకర్తలు పగటి పూట ప్రచారం చేయాడానికి అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీలకు చెందిన కీలక నేతలు మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతున్నట్లు ఉమ్మడి ADB జిల్లా రిటర్నింగ్ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్‌లో ఉదయం 7 – సాయంత్రం 6 గంటల వరకు ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లిలో ఉదయం 7 – సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
SHARE IT
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు ప్రశ్నించినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తులు దాదాపు 1100 జిల్లా పోలీసులు, 400 ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్రబలగాలు, 15 సెక్షన్ల స్పెషల్ పోలీసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. మొత్తం 1500 సిబ్బంది ఉన్నరన్నారు.
Sorry, no posts matched your criteria.