India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహనం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 50 నుంచి 55 సం.ల వయసు ఉంటుందని, నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535,8712659534 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
మంచిర్యాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముగించారు. గత కొన్నిరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కష్టపడుతూ.. ఓటును అభ్యర్థించారు. కొన్ని రోజులుగా మైకులతో మార్మోగిన ఈ ప్రాంతాలు ఈ సాయంత్రం 4 తర్వాత మైకులు మూగబోయాయి. కాగా ఈ నెల 13 ఓటింగ్ జరగనుండగా..వచ్చే నెల 4న వారి భవితవ్యం తేలనుంది.
పోలింగ్ సమయం సమయం సమీపిస్తుండటం, మరికొన్ని గంటల్లో ప్రచారానికి బ్రేక్ పడనుండటంతో పార్టీల నేతలు దూకుడు పెంచారు. అగ్రనేతలు మొదలుకుని ముఖ్య నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది.
అదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ ఆదర్శ కళాశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్ (2024-25) లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు
ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని తగిన ధ్రువపత్రాలతో కళాశాలలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల విధులకు సంబందించి ఈ నెల 1 నుంచి 3 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెండో విడుత శిక్షణకు గైర్హాజరైన 16 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంతా నోటిసులు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాద్యాయులు ఇచ్చే సంజాయిషి ఆధారంగా తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితిలో దృష్ట్యా జొన్నల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు తాత్కలికంగా కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి తిరిగి యధావిధిగా కొనుగోలు పునర్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.
పోలింగ్ రోజు ఎన్నికల విధులను నిర్వహించే సిబ్బందితో కలెక్టర్ రాజర్షి షా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, అన్ని మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. నార్నూర్, గాదిగూడలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని, మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు పీరియడ్ మొదలవుతుందన్నారు.
వచ్చే 48 గంటలు, 24 గంటలు చాలా కీలకమైనవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
★ ఎలాంటి రాజకీయ ప్రచారం, పాదయాత్రలు జరగకుండా చూడాలి
★ ప్రచార సామాగ్రి సీజ్ చేయాలి
★మద్యం దుకాణాలు మూసివేయాలి
★ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడద్దు
★ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు
★ పోలింగ్ స్టేషన్ కి ముందు 100 మీటర్లు సున్నం వేయించాలి
★ డబ్బుల పంపకంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి
జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించనున్న నూతన శిక్షణ కానిస్టేబుల్ కేంద్ర బలగాలకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్‌ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమికూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని ఓటర్లకు చెప్పాలన్నారు.
Sorry, no posts matched your criteria.