India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు భైంసాలో రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న సమావేశానికి ఆమె హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి స్టార్ క్యాంపెనర్‌గా ఆమె జిల్లాకు
వస్తున్నట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉట్నూర్‌కి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఇంటికి వెళ్తానని ప్రిన్సిపల్‌కి సెలవు పత్రం ఇచ్చి కాలేజీ నుంచి బయటికి వచ్చింది. అయితే బుధవారం ఆమె తండ్రి తనను చూడడానికి కాలేజీకి వెళ్లడంతో విషయం బయటపడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ CI అశోక్ తెలిపారు.
POLYCET ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 7న ముగిసింది. కాగా దరఖాస్తు గడువు ఈ నెల 14 వరకు పొడగించినట్లు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి జన్నావార్ కిషోర్ (68) ఆస్ట్రేలియాలో మృతి చెందారు. జిల్లాలోని వ్యాపార ప్రముఖుల్లో ఒకరైన కిషోర్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ సిటీలో మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు వద్దకు ఇటీవల వెళ్లిన ఆయన అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు.
జైపూర్ మండలంలోని కుందారం జైపూర్ క్రాస్ రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అడవిలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. కుందారం సమీపంలోని అటవీ సంస్థ నీలగిరి ప్లాంటేషన్ వద్ద రెండు రోజుల క్రితం సంచరించిన చిరుత పులి పాదముద్రలు గుర్తించామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానకుతోడు పిడుగులు పడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి రైతాంగానికి వేదన మిగిల్చింది. మంచిర్యాల జిల్లాలో 27 స్తంభాలు, ఒక ట్రాన్స్ ఫార్మర్ నేలకూలడంతో విద్యుత్ శాఖకు రూ. 12 లక్షల నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన ఉట్నూరు దత్తాత్రి(46) ఆదివారం చేపల వేటకని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం లింగా గ్రామ శివారులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తికి దత్తాత్రి మృతదేహం కనిపించింది. దీంతో భైంసా రూరల్ ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను ఓ మహిళ మోసం చేసిన ఘటన నిర్మల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ. 2-10లక్షల వరకు వసూలు చేసింది. ఆమె ఇచ్చిన ఆర్డర్ కాపీలతో ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా జరిగిన మోసం తెలుసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నకిలీ చెక్కులు రాసిచ్చి తప్పించుకుని తిరుగుతోందని బాధితులు వాపోతున్నారు.
భారతీయ జనతా పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఖానాపూర్‌కు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు రితిష్ రాథోడ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక జంగల్ హనుమాన్ ఆలయం నుంచి ఖానాపూర్ బస్టాండ్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై ఆయన పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.