India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ సప్లమెంటరీ సెకండ్ ర్యాండమైజేషన్‌ను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
2024-25 విద్యా సం.నికి సంబంధించి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. డిగ్రీలో ప్రవేశాల కోసం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ సంబంధిత అనుమానాల నివృత్తి కోసం ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని దోస్త్ కోఆర్డినేటర్ నర్సింగరావు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు.
బోథ్ మండలంలోని దనోరా గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను కలుస్తూ గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాసేపు చిన్నారులతో క్యారం ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఎంపీగా ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
పోలింగ్ బూత్‌లోకి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోదని అనుమానం కలిగినప్పుడు ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారికి రూ.2 చెల్లించి సవాల్ చేసే అవకాశం ఉంది. ఓటరు బోగస్ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. జాబితాలో ఉన్న విధంగా ఓటరే అయితే ఓటు వేయడానికి అనుమతిచ్చి, సవాల్ చేసిన ఏజెంట్ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2ను ప్రభుత్వానికి అప్పగిస్తారు.
జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని నర్సింగాపూర్, గంగిపల్లి, కుందారం, మద్దులపల్లి అటవీ పరిధిలో చిరుత పులి సంచారాన్ని గుర్తించినట్లు అటవీశాఖ బీట్ అధికారి సతీష్ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తమ అవసరాల కోసం అడవిలోకి వెళ్లొద్దని ఆయన సూచించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో త్వరగా ఓటును వినియోగించుకోవాలి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు.
ఆదిలాబాద్‌కి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన భార్యకోసం ఆన్‌లైన్‌లో రూ.700 విలువైన చీరను బుక్ చేస్తే గుడ్డ పీలికలు వచ్చిన వైనం వెలుగుచూసింది.
ప్రముఖ కంపెనీ యాప్‌లో నచ్చిన చీరను ఆర్డర్ చేసి భార్యను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నారు. డెలివరీబాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లగా.. విప్పి చూస్తే చిరిగిన పీలికలు కనిపించడంతో దంపతులు అవాక్కయ్యారు. డెలీవరీ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తే తమకేం తెలియదంటూ చేతులెత్తేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో 2 నెలల్లోనే 71 ప్రమాదాలు చోటుచేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగొంది, దేవాపూర్ చెక్ పోస్టు, మావల బైపాస్ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యవాత పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భానుడు హడలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా లింగాపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.
మానవత్వాన్ని మంటగలిపే ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. అటుగా వెళ్తున్న ప్రవీణ్ శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన బ్లూ కోట్ పోలీసులు హుటాహుటిన శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.