Adilabad

News May 3, 2024

ADB: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ (22) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 3, 2024

ADB: విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు

image

ఉమ్మడి ఆదిలాబాద్ BRS స్థానిక సంస్థల MLC దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. MLCగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ తీర్పు చెప్పింది. దండె విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2022లో ఎన్నికయ్యారు.

News May 3, 2024

ADB: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారంపై అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గరువుతున్నారు. ఈ విషయమై Way2News కేయూ అధికారులను సంప్రదించగా అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యధావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 3, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగుల కొరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు.

News May 3, 2024

రేపు మంచిర్యాల జిల్లాకు గులాబీ బాస్

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలిపారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరుపున మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రోడ్ షోలో పల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News May 3, 2024

ఆదిలాబాద్: 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలు!

image

ADB పార్లమెంట్‌లో 3 ప్రధానపార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. నియోజకవర్గంలో 16.50 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే BJP సోయంకు 3,77,374 ఓట్లు రాగా, BRS గోడం నగేశ్‌కు 318,814 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్‌కి 3,14,238 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం నగేశ్, రమేశ్ ఒకే గొడుగు కింద రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

News May 3, 2024

ఆదిలాబాద్: ఆదివాసీలు ‘సై’ అనేదెవరికో?

image

అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్, కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి.

News May 3, 2024

MNCL: రైల్వే సమస్యలు తీరదెన్నడో!

image

ఉమ్మడి జిల్లాలో రైల్వే పరంగా సమస్యలు ఉన్నాయి. కొంతకాలంగా ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు సమస్యలను రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితాలు ఉండటం లేదు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, రేపల్లివాడ, రేచిని రైల్వేస్టేషన్లో సమస్యలు ఉన్నాయి. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వేలైన్ కోసం అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

News May 3, 2024

ASF: వడదెబ్బతో ఒకరి మృతి 

image

బెజ్జూరు మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్(40) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2రోజుల క్రితం దహేగాం మండలంలోని పోలంపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వాంతులు, విరోచనాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య జానభాయ్ , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

News May 3, 2024

స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: సిఐ

image

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సిఐ శశిధర్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికలు పురస్కరించుకుని కేంద్ర బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.