Adilabad

News May 31, 2024

నస్పూర్: చోరీ కేసులో మనవరాలే సూత్రధారి

image

నస్పూర్ నాగార్జున కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్ లో చదువుకునే యువతి వేసవి సెలవుల్లో భాగంగా తన తాత ఇంటికి వచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరూ లేని సమయంలో యువకుడితో కలిసి ఇంట్లో బీరువా పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు, సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగలించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

News May 31, 2024

మంచిర్యాల: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. 2020లో పట్టణానికి చెందిన గౌతంకు హనుమకొండకు చెందిన విజయలక్ష్మితో వివాహం అయింది. కాగా కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌తో పాటు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. సమాచారం అందుకున్న SI రాజశేఖర్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

ఆసిఫాబాద్‌లో ఉద్రిక్తత

image

ఆసిఫాబాద్ మండలం దానాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు అక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించేందుకు గ్రామంలోకి వచ్చిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

News May 31, 2024

మంచిర్యాలలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి ADB జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా దహెగంలో 46., ఆదిలాబాద్ జిల్లా పిప్పల్‌దరిలో 45.2, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మధ్యాహ్నం వేళల్లో బయటకి రాకూడదన్నారు.

News May 31, 2024

ఆసుపత్రి సిబ్బంది మోసం చేశారని యజమాని ఆవేదన

image

తన ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ రాహుల్, డా.నవ్యశ్రీ మోసం చేశారంటూ ఓ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తను మెడికో కానందున SKZRలో నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిని నవ్యశ్రీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయంచగా ఇప్పుడు ఆ ఆసుపత్రిని వారు ఆక్రమించారన్నారు. గురువారం ఆసుపత్రి సామగ్రి షిఫ్ట్ చేస్తుంటే వీడియో తీసినందుకు తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

News May 31, 2024

మంచిర్యాల: అధికారిని బురిడీ కొట్టించిన తల్లీకూతుళ్లు

image

ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్‌‌కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.

News May 31, 2024

ADB: ‘క్షయ నియంత్రణకు కృషి చేయాలి’

image

జిల్లాలో క్షయ నియంత్రణకు కృషి చేయాలని డబ్ల్యూహెచ్ఓ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ సూచించారు. అదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఆసుపత్రిలో టీబీ నియంత్రణకు ఉన్న సౌకర్యాలపై రిమ్స్ డెరైక్టర్ రాథోడ్ జైసింగ్, డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తో కలిసి ఆయన గురువారం సమీక్షించారు. ప్రస్తుతం రిమ్స్ ఆవరణలో మూసి ఉన్న టీబీ వార్డును పునరుద్ధరించడంతో పాటు అందులో పేషంట్ కేర్ ను, భద్రతా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

News May 30, 2024

నిర్మల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి శివారులో బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ యువకుడు రణధీర్ మృతి చెందారని పోలీసులు తెలిపారు. రణధీర్ తన బైక్ లో పెట్రోల్ పోయించుకుని రోడ్డును దాటే క్రమంలో బస్సు ఢీ కొనడంతో గాయపడ్డారు. దీంతో ఆయనను నిర్మల్ ఆసుపత్రికి తరలించగా రణధీర్ అక్కడ మృతి చెందినట్లు వారు వెల్లడించారు. రణధీర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖానాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ADB: CM రేవంత్ రెడ్డిని కలిసిన MLA పాయల్ శంకర్

image

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని చెనాక-కోర్ట ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే రు.94 కోట్ల పరిహారం అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. ఆదిలాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని CM రేవంత్ రెడ్డిని MLA పాయల్ శంకర్ కోరారు.

News May 30, 2024

ADB: నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్: ఎస్పీ

image

ఆదిలాబాద్‌లో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీర్జా ముషారఫ్ బేగ్, షేక్ బిలాల్, అక్షయ్, దత్తును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద కారు, ఆటో, సెల్ ఫోన్, రూ.4వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.