India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 25 నుంచి మే 8 వరకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. ఫిర్యాదుల కొరకు మానిటీరింగ్ సెల్ ఇన్‌ఛార్జ్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నం:7670858440, బోథ్ సెగ్మెంట్ నం:9440995663, జిల్లాస్థాయి ఫిర్యాదు కోసం నం:1950, 18004251939 లను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లొమాల్లో ప్రవేశంకోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 24న నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు అన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో అనుమానాస్పద స్థితిలో సంజీవయ్య కాలనీకి చెందిన బొమ్మెన వినోద్(30) మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.
ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో నిన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నార్నూర్ మండలం చోర్‌గావ్‌కు చెందిన అడ మధుకర్, దుర్వ చందు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిని చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు ఇవాళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మందమర్రి ప్రాణహిత కాలనీలో మేడ మహేష్(55) అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యానికి బానిసైన మహేష్ కూర విషయంలో భార్య, కొడుకుతో శుక్రవారం గొడవ పడ్డాడు. దీంతో ఇంటి బయట కుటుంబ సభ్యులు ఉండగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ శశిధర్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నేరడిగొండ మండలంలోని వరుణ్ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.27,800 నగదు రూ. 4700 విలువచేసే మద్యం బాటిళ్లతో ఉడాయించారు. చోరీ విషయాన్ని గుర్తించిన వైన్స్ యజమానులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శ్రీకాంత్ తెలిపారు.
జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన అల్లూరి సవిత, రాఘవేందర్ రెడ్డిల కుమారుడు రంజిత్ ఏఈ పరీక్ష ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2023 అక్టోబర్‌లో రాసిన పరీక్ష తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్ష ఫలితాల్లో రంజిత్ రాష్ట్రంలో ఏడో ర్యాంకు, జోనల్ స్థాయిలో రెండో ర్యాంకు, బాసర జోన్‌లో మొదటి ర్యాంకు సాధించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఒక ప్రేమ జంట ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పట్టణంలోని కొలిపూర కాలనీకి చెందిన డొంకూరి అఖిల్, అదే కాలానీకి చెందిన పూండ్రు దివ్య ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి వధువు తరఫు వారు అంగీకరించకపోవడంతో శుక్రవారం గణేశ్ మందిరంలో పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ వివాహం నచ్చని కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందని వారు పోలీసులను ఆశ్రయించారు.
BJP అభ్యర్థి గోడం నగేశ్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. ఆయన తరఫున దాఖలైన అఫిడవిట్‌లో 3 చోట్ల ఖాళీలను పూరించకుండా వదిలేయటంపై BSP, కాంగ్రెస్, BRS అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా నగేశ్ నామపత్రాన్ని ఆమోదించారు. దీంతో కాంగ్రెస్, BSP, BRS నేతలు కలెక్టరేట్‌లోనే నిరసనకు దిగారు. ఆర్‌వో పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కంది శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోగా దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్‌లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.