India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చింతలమనేపల్లి మండలంలోని ఖర్జెల్లీ గ్రామంలో గురువారం కురిసిన గాలివానకు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకుంటున్న నాయిని తులసి ఇల్లు కూలిపోయింది. భారీగా గాలి రావడంతో ఇంటి పైకప్పుతో సహా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, నాయకులు స్పందించి తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.

కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ శివారుల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం లక్మాపూర్‌కి చెందిన రాజు చేనులో మంచెకింద ఓ జంతువు కూర్చున్నట్లు, అక్కడ ఉన్న వివిధ వస్తువులను చిందర వందరగా చేసిన ఆనవాళ్లతో పాటు పాదముద్రలు కనిపించాయి. ఆటవీ అధికారులు పాదముద్రలు పరిశీలించారు. అవి దాదాపు చిరుతవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. చిరుతతో పాటు ఓ చిన్న పిల్ల కూడా ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.

ప్రభుత్వం జిల్లాల వారీగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేయడంతో 2018 నుంచి ఉన్న బకాయిల నుంచి రైతులకు రుణవిముక్తి లభించింది. ఉమ్మడి జిల్లా మొత్తంలో తుది విడతలో 51 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. 61,416 మంది రైతుల ఖాతాల్లో రూ.846.41 కోట్లు నేరుగా జమ చేసేలా నిధులు విడుదల చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో 73 మంది పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గౌష్ అలం మెడల్స్ అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం ఉత్తమసేవలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3 ఉత్తమసేవా, 3 ఉత్క్రిస్ట సేవ, 2 అంత్రికసేవ, 65 సేవామెడల్స్ పొందిన పోలీస్ అధికారులకు ఎస్పీ మెడల్స్ బహుకరించారు.

78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ అవమానం జరిగిందని ప్రాతినిధ్య AITUC సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సభా ప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. తిరుపతి మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా వేడుకలకు పిలిచి ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ఆగ్రహించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం పనికిరాదన్నారు.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఆదివాసీ బాలిక(17)ను ప్రేమపేరుతో మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాధిత బాలికను ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌కు చెందిన ముబాషిర్ 6 నెలలుగా ప్రేమపేరుతో మభ్యపెడుతూ లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించడాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం ఘనంగా స్వాగతం పలికారు.

మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన రైతు దూసముడి రాములు-లక్ష్మి దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ ఇటీవల TGPSC విడుదల చేసిన సివిల్ ఇంజినీరింగ్ AEE ఫలితాలలో మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించాడు. అలాగే AE, TPBO, TO(Ground Water dept) మెరిట్ అర్హతను సాధించాడు. 10th వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతడు KUలో BTech, JNTUHలో MTech పూర్తిచేశాడు.
Sorry, no posts matched your criteria.