India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. రైతు జైవంత్‌రావు, హలిమాబాయిల కుమార్తె దేశస్థాయిలో 67వ ర్యాంకు సాధించడంతో స్థానికులు ఆమెను అభినందించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ గ్రీన్‌సిటీకి చెందిన విద్యార్థి రామగిరి కార్తిక్ ఓబీసీ విభాగంలో తొలి ప్రయత్నంలోనే1,997 ర్యాంకుతో సత్తాచాటాడు.
బెజ్జూర్ మండలం పోతపల్లి- కోర్తేగూడ మధ్య అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆర్కగూడకు చెందిన మహేశ్(25), బారేగూడకు చెందిన వెంగలరావు(30)లు బూర్గుగూడకువెళ్లొస్తున్నారు. ఎల్కపల్లికి చెందిన నర్సింహ(20), నిఖిల్, రాజ్‌కుమార్ బారేగూడ వైపు విందుకు వెళ్తున్న క్రమంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మహేశ్, వెంగలరావు, నర్సింలు అక్కడికక్కడే మృతి చెందారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మే 13న జరిగే ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లో ఓటరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు 17 నామినేషన్ల దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. 23 మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం 42 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.
ఇంటర్లో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లోని సుభాష్ నగర్లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన అరవింద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో ఇనుప రాడ్‌కు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబీకులు లేచి చూసే సరికి చనిపోయాడు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. పట్టణంలోని ధోబీ కాలనీలో ఓఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. మహిళ కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల ఎస్ఐ వంగ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఐఈవో రవీందర్ కుమార్ తెలిపారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు మే 2వ తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు. రీకౌంటింగ్ కోసం రూ.600 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు.
టెక్నికల్ ట్రెయినింగ్ కోర్స్ (టీటీసీ) ఫలితాలు వెలువడినట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెమోలు www.bse.telangana. gov.in వెబ్ సైట్లో ఉంచినట్లు వెల్లడించారు. రూల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి మెమోలు పొందవచ్చని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ తర్వాత పంపించనున్నట్లు వివరించారు.
ADB బీజేపి అభ్యర్థి గోడం నగేశ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో ఆయన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ ఆస్తుల విలువ రూ. 3.09 కోట్లుగా ఉంది. ఆయన పేరిట స్విఫ్ట్ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు, ADBలో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, జాతరాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లుగా ఉంది. రూ. 29.01 లక్షల అప్పులున్నాయి.
Sorry, no posts matched your criteria.