Adilabad

News April 25, 2024

ఉట్నూర్: బైక్‌పై నుంచి పడి మహిళ మృతి 

image

బైక్‌పై నుంచి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఉట్నూర్‌లోని పులిమడుగులో చోటుచేసుకుంది. బైక్‌పై ఇంద్రవెల్లి వైపు వెళ్తుండగా ఆందోలి క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన శ్లోక

image

రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. స్థానిక ఎంప్లాయిస్ కాలనీకి చెందిన తమ్మల-గంగన్న దివ్యల కూతురు తమ్మల శ్లోక బైపీసీ విభాగంలో 440 మార్కుల కు గాను 432 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రాణించింది. రాష్ట్ర స్థాయిలో రాణించిన శ్లోకను పలువురు అభినంధించారు.

News April 25, 2024

ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్.. 30వ స్థానంలో మంచిర్యాల

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 72.06 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 4095 మందికి 2951 మంది పాసయ్యారు. 66.17 శాతంతో నిర్మల్ 12వ స్థానంలో నిలిచింది. 5477 మందికి 3624 మంది పాసయ్యారు. 65.75 శాతంతో ఆదిలాబాద్ 13 స్థానంలో నిలిచింది. 8320 మందికి 5470 మంది పాసయ్యారు. 59.53 శాతంతో 30వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5370 మందికి 3197 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్.. 32వ స్థానంలో మంచిర్యాల

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 61.55 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 8వ స్థానంలో నిలిచింది. 8551 మందికి 5200 మంది పాసయ్యారు. 61.05 శాతంతో ఆదిలాబాద్ 9 స్థానంలో నిలిచింది. 8551 మందికి 5220 మంది పాసయ్యారు. 56.05 శాతంతో నిర్మల్ 16 స్థానంలో నిలిచింది. 5467 మందికి 3064 మంది పాసయ్యారు. 46.29 స్థానంతో 32వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5455 మందికి 2525 మంది పాసయ్యారు.

News April 25, 2024

MNCL: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

image

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కాజీపేట శ్రీనివాస్ (52) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంచిర్యాల రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బైక్ పై వస్తున్న శ్రీనివాసును కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని ఎస్సై మహేందర్ తెలిపారు.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు..ఉమ్మడి ADB నుంచి ఎంత మంది అంటే..

image

నేడు ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు వెలువడనున్నాయి. MNCL జిల్లాలో 8394 మంది ఫస్ట్ ఇయర్, 7135 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ADB జిల్లాలో ఫస్ట్ ఇయర్ 10424, సెకండ్ ఇయర్ 9347, NRML ఫస్ట్ ఇయర్ 6535, సెకండ్ ఇయర్ 6810 మంది పరీక్షలు రాశారు. ASF జిల్లాలో ఫస్ట్ ఇయర్ 5423, సెకండ్ ఇయర్ 5003 మంది పరీక్షలు రాశారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

తాండూర్: పోలీస్ విధులకు ఆటంకం.. ఏడుగురి రిమాండ్

image

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు తాండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కేసు నమోదు కాగా మంగళవారం రిమాండ్ కు తరలించారు.

News April 25, 2024

ADB: ‘బి’ ఫారం అందుకున్న ఆత్రం సాయుధ

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆత్రం సుగుణక్క ‘బి’ ఫామ్‌ను తనయుడు ఆత్రం సాయుధ మంగళవారం గాంధీభవన్ లో అందుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పార్టీ టికెట్టును ఆత్రం సాయుధకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సత్తు మల్లేష్, నరేందర్ తదితరులున్నారు.

News April 25, 2024

ఆదిలాబాద్: ‘అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్’

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట(ఖమ్మం)సెగ్మెంట్లలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

ఆదిలాబాద్: ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ

image

ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పంపిణీకి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందరికి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటర్ గైడ్‌ను కూడా అందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

error: Content is protected !!