India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచిర్యాల జిల్లాలో పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.
ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లోని సుభాష్ నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన అరవింద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో ఇనుప రాడ్‌కు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబీకులు లేచి చూసే సరికి చనిపోయాడు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. పట్టణంలోని ధోబీ కాలనీలో ఓఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. మహిళ కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల ఎస్ఐ వంగ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఐఈవో రవీందర్ కుమార్ తెలిపారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు మే 2వ తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు. రీకౌంటింగ్ కోసం రూ.600 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు.
టెక్నికల్ ట్రెయినింగ్ కోర్స్ (టీటీసీ) ఫలితాలు వెలువడినట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెమోలు www.bse.telangana. gov.in వెబ్ సైట్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రూల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి మెమోలు పొందవచ్చని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ తర్వాత పంపించనున్నట్లు వివరించారు.
ADB బీజేపి అభ్యర్థి గోడం నగేశ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో ఆయన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ ఆస్తుల విలువ రూ. 3.09 కోట్లుగా ఉంది. ఆయన పేరిట స్విఫ్ట్ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు, ADBలో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, జాతరాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లుగా ఉంది. రూ. 29.01 లక్షల అప్పులున్నాయి.
మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. వంజారిగూడ గ్రామానికి చెందిన బాలాజీ(28)కి చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. మంగళవారం ఉదయం వాళ్ల వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం రాత్రి వరకు గాలించగా కనిపించలేదు. కాగా నిన్న శివారులోని బావిలో శవమై కనిపించాడు.
బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాలలో విద్యుత్ షాక్ తో బొమ్మగోని అనిల్ గౌడ్ (28) మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు ఇంట్లో కూలర్ ప్లగ్‌ను జంక్షన్ బాక్స్‌కు అమరుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ గౌడ్ మంచిర్యాలలోని ఎస్ఐ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తాళ్లగురిజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. వాహనాల తనిఖీ చేపడుతుండగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న మహ్మద్ అస్లాం ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును తీసుకువెళుతున్నాడు. అతడి నుంచి రూ. లక్ష నగదును సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ టీంకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన కొత్తూరి అరుణ ప్రసన్న కుమార్ దంపతుల కుమార్తె కొత్తూరి రేచల్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. దింతో పలువురు ఆమెను అభినందించారు. ఇదే స్పూర్తితో మున్ముందు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.