India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7వ రోజు 12 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌వో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 12 నామినేషన్ల దాఖలైనట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఆయన ఒంటరిగా వచ్చి రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమంలో ఎవరూ లేకపోవడం గమనార్హం.
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడి పరారీలో ఉన్న హోమ్ గార్డ్ షమీముల్లా ఖాన్ (షకీల్)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పలువురిని మోసగించినట్లు సీఐ అనిల్ తెలిపారు. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి పోలీసులను అభినందించారు.
ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చులాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైదం నారాయణ కుమారుడు మైదం సాత్విక్ ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నట్లు ఎస్ఐ జగదీశ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
నిర్మల్ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన గువ్వల రవి(23) సంవత్సరం క్రితం కతర్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ వారం రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి స్నేహితుల సాయంతో రవి కుటుంబీకులు తెలంగాణ గల్ఫ్ సమితిని ఆశ్రయించి మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని కోరారు. యాజమాన్యంతో మాట్లాడిన అధికారులు బుధవారం మృతదేహాన్ని గ్రామానికి రప్పించారు.
కుబీర్ మండలం సిరిపల్లి తండాకు చెందిన రాథోడ్ అంజలి నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నిర్మల్‌లోని టీఎస్ఆర్‌జేసీలో ఇంటర్ చదువుతున్న అంజలి బైపీసీ గ్రూపులో 440 మార్కుల గాను 437 మార్కులు సాధించింది. దీంతో ఆమెను కుటుంబీకులు, గ్రామ సర్పంచ్ అశ్విని పండిత్ జాధవ్, గోపీచంద్ జాధవ్‌తో పాటు పలువురు అభినందించారు.
బైక్‌పై నుంచి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఉట్నూర్‌లోని పులిమడుగులో చోటుచేసుకుంది. బైక్‌పై ఇంద్రవెల్లి వైపు వెళ్తుండగా ఆందోలి క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. స్థానిక ఎంప్లాయిస్ కాలనీకి చెందిన తమ్మల-గంగన్న దివ్యల కూతురు తమ్మల శ్లోక బైపీసీ విభాగంలో 440 మార్కుల కు గాను 432 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రాణించింది. రాష్ట్ర స్థాయిలో రాణించిన శ్లోకను పలువురు అభినంధించారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 72.06 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 4095 మందికి 2951 మంది పాసయ్యారు. 66.17 శాతంతో నిర్మల్ 12వ స్థానంలో నిలిచింది. 5477 మందికి 3624 మంది పాసయ్యారు. 65.75 శాతంతో ఆదిలాబాద్ 13 స్థానంలో నిలిచింది. 8320 మందికి 5470 మంది పాసయ్యారు. 59.53 శాతంతో 30వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5370 మందికి 3197 మంది పాసయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 61.55 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 8వ స్థానంలో నిలిచింది. 8551 మందికి 5200 మంది పాసయ్యారు. 61.05 శాతంతో ఆదిలాబాద్ 9 స్థానంలో నిలిచింది. 8551 మందికి 5220 మంది పాసయ్యారు. 56.05 శాతంతో నిర్మల్ 16 స్థానంలో నిలిచింది. 5467 మందికి 3064 మంది పాసయ్యారు. 46.29 స్థానంతో 32వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5455 మందికి 2525 మంది పాసయ్యారు.
Sorry, no posts matched your criteria.