Adilabad

News April 20, 2024

ఆదిలాబాద్: బంగారం లేని ఎంపీ అభ్యర్థి

image

ADB కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున MLA వెడ్మబొజ్జు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగులో ఉన్నట్లు సుగుణ వెల్లడించారు. 2023-24లో తన పేరిట రూ. 5,64,170 ఆదాయం ఉందని చూపించగా..భర్త పేర రూ. 19,08,010 ఉన్నట్లుగా నివేదికలో ప్రస్తావించారు. చరాస్తులు రూ. 12,10,000, స్థిరాస్తులు రూ. 42,50,000 చూపించారు.

News April 20, 2024

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా అధికారులు ఎన్నికలపై నిర్వహిస్తున్న సమావేశాలను ఆయనకు వివరించారు.

News April 19, 2024

నర్సాపూర్: 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

image

నిర్మల్ జిల్లా నర్సాపూర్(G) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. వారు ఆసుపత్రికి చేరుకున్నారు.

News April 19, 2024

రేపు ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క రాక

image

ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 20న శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి రాష్ట్రమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి సీతక్క రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఉదయం 9:00 గంటలకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి మంత్రి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News April 19, 2024

నేరడిగొండలో రూ.5.17లక్షల నగదు సీజ్

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మండ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఓ వాహనంలో ఇద్దరు సరైన పత్రాలు లేకుండా రూ.5.17లక్షలను తరలిస్తుండగా పట్టుపడ్డారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

News April 19, 2024

దస్తురాబాద్: వడదెబ్బతో కూలీ మృతి

image

వడదెబ్బ తగిలి కూలీ మృతిచెందిన దస్తూరాబాద్ మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన రామగిరి లక్ష్మీ నర్సయ్య (48) రోజులాగే కూలీ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు వారు తెలిపారు. మృతునికి భార్య గంగాభవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News April 19, 2024

ADB: రిమ్స్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

image

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.

News April 19, 2024

ADB: ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ICMR ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో అమలు చేయనున్న సంకల్ప్ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు DMHO నరేందర్ తెలిపారు. మూడేళ్ల పాటు పని చేసే ఈ ప్రాజెక్ట్‌లో నర్సు-1 (5పోస్టులు), నర్సు-3(5), రీసెర్చ్ సైంటిస్ట్-3 మెడికల్ (1), పిల్లల వైద్యనిపుణుడు (1), గైనకాలజిస్ట్, డాటాఎంట్రీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అర్హులైన వారు పూర్తి వివరాలకు thanigaipaeds@gamail.com వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.

News April 19, 2024

MNCL: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలు డార్క్ బ్రౌన్ రంగు పూల చీర, బ్రౌన్ కలర్ డాట్స్ బ్లౌజ్, ఆకుపచ్చ పసుపు పచ్చ గాజులు ధరించి ఉంది. జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ ఉత్తర్వు మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658596, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 19, 2024

మంచిర్యాల: వడదెబ్బతో ఒకరి మృతి

image

మంచిర్యాల ఇక్బాల్ అహ్మద్ నగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ షేక్ పాషా (40) గురువారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. మృతుడు కొద్దిరోజులుగా మద్యం తాగుతూ అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన అతడిని ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్నట్లు గుర్తించారు .స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!