India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. 1952లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఏర్పడింది. 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి మొట్టమొదటి సారి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు.
రాష్ట్రంలో కరవు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగొలు చేయకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. CM మాటలు ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారన్నారు. కౌలు రైతులను కలుపుకుని రూ.90వేల కోట్లు రైతంగానికి ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం, రూ.లక్ష ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. వారితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు ఉన్నారు. ఇప్పటివరకు ఆమె రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జన జాతర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి దేవుని పైన నమ్మకం ఉందన్నారు. గుడిలా పేరు చెబుతూ రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దేవుడు గుడిలో ఉండాలే భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు.
ADB జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ ద్వారా సీఎం జన జాతర సభకు చేరుకోగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనునట్లు విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
దహెగాం మండలం పెసరుంట గ్రామానికి చెందిన జుమిడె కిరణ్ (27) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కందూరి రాజు తెలిపారు. కిరణ్ కడుపునొప్పితో కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం సమీప వాగుకు వెళ్లి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.
BJP సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్, BRS సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.45కు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ADB బయలుదేరుతారు. 11 గంటలకు డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రసంగించి మధ్యాహ్నం 12.30కు నిజామాబాద్‌కు పయనం అవుతారు.
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్న యువకుడు మరుగుదొడ్డిలో పడి మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన క్రాంతి(30) ఈ నెల 15న అనారోగ్య సమస్యలతో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం బాధితుడి బంధువు ఒకరు వచ్చి బలవంతంగా నిద్రలేపి మరుగుదొడ్డికి తీసుకెళ్లారు. అనంతరం మరుగుదొడ్డిలో పడి మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.