India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డబ్బుకోసం మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన ఇచ్చోడలో జరిగింది. SI నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోరిగామకు చెందిన నర్సమ్మ (55) శుక్రవారం ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసుకోని ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన విజయ్, ఇనాజ్ షేక్ అహ్మద్ డబ్బుకోసం ఆమెపై దాడి చేశారు. ఆమె కేకలు వేయడంతో పారిపోయారు. అల్లుడు సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
సోన్ మండలం గంజాల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పాలెపు గంగయ్య (43) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ నెల 12న గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న వ్యాన్‌ను సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ ఈఎంటీ దీపక్, పైలెట్ వసీం రిమ్స్‌కు తరలించారు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2023 జులై నెలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి ప్రణీత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 23తో విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో సర్దుబాటు చేసిన 121 మంది ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. వారందరూ ఏప్రిల్ 23న తమ పాఠశాలల్లో హాజరుకావాలని సూచించారు.
దేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా ఈ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. అలాగే ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరగగా 12 మంది మాత్రమే గెలిచారు. మాధవరెడ్డి, గంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి రెండేసి సార్లు, వేణుగోపాలాచారి మూడుసార్లు విజయం సాధించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేశ్ బీ ఫామ్ అందుకున్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, జిల్లా పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తదితరులు ఉన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మూడో రోజైన శనివారం ఎలాంటి నామినేషన్‌లు దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్ దరి గ్రామానికి చెందిన ప్రేమికులు భుజంగరావు, కవిత శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో కవిత అక్కడికక్కడే మృతి చెందగా, భుజంగరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశంకోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 24 న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. రూ.100 రుసుముతో APR 24 వరకు ఛాన్స్ ఉందన్నారు
పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయని వివరించారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4.18 ఎకరాలు, సంబల్‌పుర్(ఒడిశా)లో 10.09 ఎకరాల భూమి, అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.