India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ-గీత దంపతుల కుమారుడు రేకుళ్వార్ శుభం సివిల్స్‌లో అలిండియా స్థాయిలో 790వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయంలో పదోతరగతి పూర్తిచేశాడు. అనంతరం అస్సాంలోని గువాహటి IITలో సివిల్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ ఎంపికయ్యాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి ఆయనకు సూచించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జీవన్ రెడ్డి తదితరులున్నారు.
ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ తోపాటు పలువురు నాయకులు తిరిగి మంగళవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు సొంతగూటికి చేరుకున్నారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్లనే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కేటీఆర్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
నిర్మల్ జిల్లా బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ సెంకడీయర్ చదవుతున్న అర్వింద్ వసతి గృహంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. అర్వింద్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న 18 గ్రామాలను అటవీ శాఖ గుర్తించింది. వారిని అక్కడి నుంచి తరలించే యోచన చేసింది. దీనిలో మొదటి ప్రాజెక్టుగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల తరలింపుకు సర్వం సిద్ధం చేసింది. గత ఐదారేళ్లుగా కొత్త మద్దిపడగలో కాలనీ నిర్మించింది. సోమవారం నుంచి ఆ గ్రామాన్ని తరలిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎన్నికల నియమావళి అమలైనప్పటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. దాదాపు నెల రోజుల్లోనే రూ.12 లక్షల విలువైన 41 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఈ రెండు శాఖల అధికారుల తనిఖీల వల్ల ప్రస్తుతం కొంత వరకు గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడినట్లయింది. 29 మంది నిందితులపై 16 కేసులు నమోదు చేశారు.
నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ కొలాం బొజ్జుగూడగిరిజనులు మంచినీరు రావడం లేదని నిరసన తెలిపారు. కొలంగూడ నుంచి ఎంపీడీవో కార్యాలయానికి ఖాళీ బిందెలతో 3 కి.మీ కాలినడకన వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. 45 రోజులుగా మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొన్నారు. MLA కోవ లక్ష్మి మిషన్ భగీరథ పైపులైన్ కోసం రూ. 5 లక్షలు మంజూరు చేసినా అధికారులు స్పందించకపోవడంతో నీటి వెతలు తప్పడం లేదన్నారు.
నిర్మల్ పట్టణానికి చెందిన యమున అనే మహిళ నుంచి 2 తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అపహరించారు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా శివాజీ చౌక్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొలుసు లాక్కెళ్లారు. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ తెలిపారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DYSO వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్వాహకులకు గౌరవవేతనం, ఉచితంగా క్రీడా సామాగ్రి అందిస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు వారి వివరాలతో ఈ నెల 22వ తేదీలోపు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయం చిరునామాకు పంపించాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. 150 మార్కులతో పరీక్ష ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.