Adilabad

News May 11, 2024

ఆదిలాబాద్: 3రోజులు జొన్నల కొనుగోలు నిలిపివేత

image

ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితిలో దృష్ట్యా జొన్నల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు తాత్కలికంగా కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి తిరిగి యధావిధిగా కొనుగోలు పునర్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.

News May 10, 2024

ఆదిలాబాద్: రేపు సాయంత్రం 4 గంటలకు SILENT MODE

image

పోలింగ్ రోజు ఎన్నికల విధులను నిర్వహించే సిబ్బందితో కలెక్టర్ రాజర్షి షా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, అన్ని మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. నార్నూర్, గాదిగూడలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని, మిగితా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు పీరియడ్ మొదలవుతుందన్నారు.

News May 10, 2024

ALERT: ఆదిలాబాద్ కలెక్టర్ కీలక సూచనలు

image

వచ్చే 48 గంటలు, 24 గంటలు చాలా కీలకమైనవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
★ ఎలాంటి రాజకీయ ప్రచారం, పాదయాత్రలు జరగకుండా చూడాలి
★ ప్రచార సామాగ్రి సీజ్ చేయాలి
★మద్యం దుకాణాలు మూసివేయాలి
★ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడద్దు
★ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు
★ పోలింగ్ స్టేషన్ కి ముందు 100 మీటర్లు సున్నం వేయించాలి
★ డబ్బుల పంపకంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి

News May 10, 2024

ADB: పోలీసులకు అవగాహన కల్పించిన SP

image

జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించనున్న నూతన శిక్షణ కానిస్టేబుల్ కేంద్ర బలగాలకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్‌ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమికూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని ఓటర్లకు చెప్పాలన్నారు.

News May 10, 2024

ఆదిలాబాద్: బీఆర్ఎస్ ప్రచార రథం బోల్తా.. తప్పిన ప్రమాదం

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి తలకిందులు అయింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార నిమిత్తం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడి తలకిందులు అయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

News May 10, 2024

ఆదిలాబాద్ : మీరు ఓటేశారా..? నేడే LAST మరీ..!

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News May 10, 2024

MNCL: రైలు కింద పడి సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన ఊరుగొండ సాయికుమార్ అనే సింగరేణి కార్మికుడు గురువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 20న ఉద్యోగంలో చేరిన సాయికుమార్ గనిలో దిగాలంటే భయంగా ఉందని, ఉద్యోగం చేయలేనంటూనే వాడు. ఈ క్రమంలో గురువారం డ్యూటీకి వెళ్లిన సాయికుమార్ రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

News May 10, 2024

నిర్మల్: సెల్‌ఫోన్‌కి బానిసై తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్

image

సెల్‌ఫోన్‌కి బానిసైన 9వ తరగతి విద్యార్థి (17) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌(M) బోరిగాంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం..రాకేశ్‌కి అతడి తండ్రి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి బాలుడు గేమ్‌లు ఆడుతూ ఫోన్‌కి బానిసయ్యాడు. దీంతో తండ్రి ఫోన్ అతిగా వాడోద్దని మందలించి ఫోన్ తీసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు.

News May 9, 2024

ఆదిలాబాద్: ఉరేసుకొని బలవన్మరణం

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలి పని చేసుకుని జీవించే ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News May 9, 2024

తానూర్: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

image

ఉపాధి హామీ పనులకు వెళ్లి వడ దెబ్బకు గురైన కూలి మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. బోసి గ్రామానికి చెందిన పర్వార్ విఠ్ఠల్ (60) బుధవారం కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రాగా.. అస్వస్థతకు గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.