Adilabad

News May 7, 2024

ADB: చీర ఆర్డర్ చేస్తే.. పీలికలు వచ్చాయి..!

image

ఆదిలాబాద్‌కి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన భార్యకోసం ఆన్‌లైన్‌లో రూ.700 విలువైన చీరను బుక్ చేస్తే గుడ్డ పీలికలు వచ్చిన వైనం వెలుగుచూసింది.
ప్రముఖ కంపెనీ యాప్‌లో నచ్చిన చీరను ఆర్డర్ చేసి భార్యను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నారు. డెలివరీబాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లగా.. విప్పి చూస్తే చిరిగిన పీలికలు కనిపించడంతో దంపతులు అవాక్కయ్యారు. డెలీవరీ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తే తమకేం తెలియదంటూ చేతులెత్తేశారు.

News May 7, 2024

ఆదిలాబాద్: రెండు నెలల్లో 27 మంది దుర్మరణం

image

ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో 2 నెలల్లోనే 71 ప్రమాదాలు చోటుచేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగొంది, దేవాపూర్ చెక్ పోస్టు, మావల బైపాస్ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యవాత పడుతున్నారు.

News May 7, 2024

MNCL: ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భానుడు హడలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా లింగాపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.

News May 6, 2024

జన్నారం: పొదల్లో ఆడ శిశువు లభ్యం

image

మానవత్వాన్ని మంటగలిపే ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. అటుగా వెళ్తున్న ప్రవీణ్ శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన బ్లూ కోట్ పోలీసులు హుటాహుటిన శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News May 6, 2024

మంచిర్యాల: కూతురు పెళ్లైన కాసేపటికే తండ్రి మరణం

image

కూతురు వివాహం అయి 24గంటలు గడవక ముందే తండ్రి మృతిచెందిన ఘటన చెన్నూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మెయిన్ రోడ్‌లో జనరల్ స్టోర్ నడుపుతున్న మహ్మద్ ఏజాజ్ ఆదివారం రాత్రి తన కూతురికి వివాహం చేశాడు. వివాహవేడుక పూర్తయిన కాసేపటికే గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News May 6, 2024

ఆసిఫాబాద్: సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని గురుడుపేట్‌లో భీమ్‌రావు(30)అనే వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 6, 2024

ఆదిలాబాద్: గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యం

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో గుర్తుతెలియని <<13186266>>అస్థిపంజరం <<>>లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిపాని గ్రామానికి చెందిన భూమన్న వారం క్రితం హనుమాన్ మాలధరించి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అస్థిపంజరం పక్కన పురుగు మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి పందులు పీక్కుతిన్నాయి. అస్థిపంజరం ముఖభాగం ఉండటంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

ఆదిలాబాద్: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల కోసం 123 పరీక్ష కేంద్రాలను,123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

మంచిర్యాల: వరుడి ఇంటి ముందు నవ వధువు ఆందోళన

image

ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు ఆందోళన చేసింది. వివరాలిలా.. గత నెల 24న BPL మండలం కాసిరెడ్డిపల్లెకు చెందిన ప్రవీణ్‌కు MNCLకు చెందిన ఓ యువతి(22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే ఆమెను తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఇంట్లో అన్నం తినకుండా, జ్యూస్‌లే తాగుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. ఎస్ఐ నరేశ్‌ సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్‌కు రావాలని చెప్పామన్నారు.

News May 6, 2024

ADB: ఓటు వేసేవారికి కలెక్టర్ సూచనలు

image

ఓటు వేయడానికి ఈ కింది వాటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, MNREGA జాబ్ కార్డు, ఫోటోతో ఉన్న పోస్టఫీస్ పాస్‌బుక్, కార్మికశాఖ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, దివ్యంగుల కార్డు, MP, MLA గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలన్నారు.