India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్లు తప్పకుండా గెలుస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల లూటీ జరిగిందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ, ఖర్గే రాలేదని అన్నారు. వారికి హిందూ సమాజం పై ప్రేమ లేదని ఆరోపించారు.
నిర్మల్‌లో నిర్వహించిన జనసభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి తీరుతాం ★త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం
★ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చిన మోదీ ప్రభుత్వం ★రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం ★కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ★ఉపాధి హామీ కింద రోజుకు 400 కూలీ ఇస్తాం ★ప్రతి మహిళ అకౌంట్‌లో ఏడాదికి రూ.లక్ష వేస్తాం.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఈరోజు ఉదయం వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. తాండూరు మండలానికి చెందిన ఆయన రెబ్బెన పరిధిలో విధులు నిర్వహించినట్లు మండల వాసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో 45.7 డిగ్రీల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాలైన నర్సాపూర్ జి, కడెం, కుబీర్, ఖానాపూర్, భైంసా మండలాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించింది. వీటిలో 45.1 డిగ్రీ నుంచి 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్లాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభాస్థలి ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పరిశీలించారు. హెలి ప్యాడ్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 5వ తేదీన ఒకే రోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రావడం ఆసక్తి రేపుతోంది. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే నిర్మల్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హజరు కానుండగా.. కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. ఆదిలాబాద్ MLC సభ్యుడు దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి నిర్వహించక తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విఠల్ సుప్రీం కోర్టుకు వెళితే అక్కడి నుంచి వచ్చే ఫలితాన్ని బట్టి ఏం జరుగుతుందో ఆసక్తి నెలకొంది.
పరీక్షలకు భయపడి బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తీకి చెందిన మహా శివప్రియ(20) ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఫార్మసీ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఫార్మా డీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని భయాందోళన చెంది ఉదయం హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.