Adilabad

News May 4, 2024

ADB: ఆద‌ర్శంగా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే

image

సర్కారు దవాఖానకు నేను రాను అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు సర్కారీ దవాఖానలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని, ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా MLA వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా ప్రభుత్వ ద‌వ‌ఖానాకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా తన తండ్రి భీంరావు ద‌వ‌డ‌కు క్యాన్స‌ర్ కావ‌డంతో ఆయన ఆదిలాబాద్ రిమ్స్ లో చేర్పించి శ‌స్త్ర చికిత్స చేయించారు

News May 4, 2024

రూ: 2లక్షల 53 వేల విలువగల గంజాయి స్వాధీనం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దీని విలువ రూ: 2లక్షల 53 వేలు ఉంటుందని పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై లాల్ సింగ్ నాయక్, తదితరులు ఉన్నారు.

News May 4, 2024

ADB: ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

పార్లమెంటు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని అదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా, సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ సమక్షంలో ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ జరిపారు.

News May 3, 2024

ADB: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ (22) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 3, 2024

ADB: విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు

image

ఉమ్మడి ఆదిలాబాద్ BRS స్థానిక సంస్థల MLC దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. MLCగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ తీర్పు చెప్పింది. దండె విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా 2022లో ఎన్నికయ్యారు.

News May 3, 2024

ADB: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారంపై అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గరువుతున్నారు. ఈ విషయమై Way2News కేయూ అధికారులను సంప్రదించగా అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యధావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 3, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగుల కొరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు.

News May 3, 2024

రేపు మంచిర్యాల జిల్లాకు గులాబీ బాస్

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలిపారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరుపున మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రోడ్ షోలో పల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News May 3, 2024

ఆదిలాబాద్: 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలు!

image

ADB పార్లమెంట్‌లో 3 ప్రధానపార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. నియోజకవర్గంలో 16.50 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే BJP సోయంకు 3,77,374 ఓట్లు రాగా, BRS గోడం నగేశ్‌కు 318,814 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్‌కి 3,14,238 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం నగేశ్, రమేశ్ ఒకే గొడుగు కింద రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

News May 3, 2024

ఆదిలాబాద్: ఆదివాసీలు ‘సై’ అనేదెవరికో?

image

అడవుల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారంతో ముచ్చటగా మూడు పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీజేపీ, గెలిచి నిలిచేందుకు బీఆర్ఎస్, కొత్త ఆశలతో కాంగ్రెస్.. ముచ్చటగా మూడు పార్టీలు సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి.