India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో రైల్వే పరంగా సమస్యలు ఉన్నాయి. కొంతకాలంగా ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు సమస్యలను రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితాలు ఉండటం లేదు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, రేపల్లివాడ, రేచిని రైల్వేస్టేషన్లో సమస్యలు ఉన్నాయి. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వేలైన్ కోసం అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
బెజ్జూరు మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్(40) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2రోజుల క్రితం దహేగాం మండలంలోని పోలంపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వాంతులు, విరోచనాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య జానభాయ్ , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సిఐ శశిధర్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికలు పురస్కరించుకుని కేంద్ర బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూతగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా స్టేషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ తీర్పు ఇచ్చినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. 2019లో భూ తగాదాలను దృష్టిలో పెట్టుకొని శ్యామ్ రావు(52), భార్య ధారాభాయ్(45)లను హత్య చేసినట్లు రుజువైనందున శిక్ష ఖరారు చేశారు.
నిర్మల్ పట్టణంలోని 27, 39వ వార్డులకు చెందిన కౌన్సిలర్ దంపతులు తౌహీద్దీన్, ఆయేషా గురువారం సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్‌లో చేరారు. అల్లోల కాంగ్రెస్‌లో చేరడంతో తిరిగి వారు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ ఆదిలాబాద్ జిల్లాతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది ★ ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు
★ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన BJP
★ అడవి బిడ్డలకు అండగా నిలబడిన మంత్రిగా సీతక్క
★ మూతబడిన CCI గురించి పట్టించుకోని మోదీ, కేసీఆర్ ★పదేళ్లు గిరిజనుల సమస్యలు పట్టించుకోని KCR.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాగల మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం గరిష్ఠంగా జిల్లా వ్యాప్తంగా 45.5 డిగ్రీలు, గురువారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం 42.7, శనివారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది ఆదిలాబాద్ జిల్లా. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో విభిన్న తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 లక్షల 44 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, BRS, BJP పోటీ చేయగా, ముగ్గురు టీచర్లే. ఈ తరుణంలో ఆదిలాబాద్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్‌లో అడుగుపెట్టేది ఎవరో కామెంట్ చేయండి.
తాండూరు SI జగదీశ్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 IG రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్-1 IG PDS రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన PDS బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో SI జగదీశ్ అలసత్వం పాటు, పలు ఆరోపణలు రావడంతో SIని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. లింగట్లకు చెందిన మహేందర్ ఆదిలాబాద్ రిమ్స్‌లో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 26న వివాహమైంది. బుధవారం లింగట్ల నుంచి బైక్‌పై రిమ్స్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి-44పై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.